Ads
వచ్చే నెలలో కొన్ని విషయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. కొన్ని నియమాలు ప్రవేశపెట్టబోతున్నారు. అందులో రోజువారి జీవితంలో వాడే ఎన్నో వస్తువులు, నిత్యవసర సామాన్ల ధరలు కూడా మారబోతున్నాయి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
# ఇందులో మొదటిగా మాట్లాడుకోవాల్సింది ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల గురించి. మే నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే జూన్ నెలలో ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద స్పష్టత కోసం అందరూ చూస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, జూన్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతాయి అని అంటున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం అలాగే ఉంటాయి.
# ప్రతిరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మారుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే జూన్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మారే అవకాశాలు ఉన్నాయి.
# మైనర్ యువతీ యువకులు డ్రైవింగ్ చేయకుండా కఠిన నియమాలని ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తూ దొరికితే 25 వేల రూపాయల జరిమానా విధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, ఆ వాహనం యొక్క ఓనర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా రద్దు చేస్తారు. ఎక్కువ వేగంతో వెళితే 1000 నుండి 2000 మధ్య ఫైన్ వేస్తారు.
# డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కూడా కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెడుతున్నారు. జాతీయ రహదారుల, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వారు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విషయంలో కొన్ని కొత్త నియమాలని తీసుకొస్తున్నారు. ఈ నియమాల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ ట్రయల్ టెస్ట్ చేయడానికి ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్స్ లోనే డ్రైవింగ్ టెస్ట్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అప్లై చేసిన వ్యక్తికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి, లైసెన్స్ కూడా కల్పించే అధికారాన్ని ఈసారి డ్రైవింగ్ సెంటర్స్ కి ప్రభుత్వం ఇచ్చింది.
# జూన్ నెలలో 10 బ్యాంక్ హాలిడేస్ ఉంటున్నాయి. ఐదు ఆదివారాలు, రెండవ శనివారం, నాలుగవ శనివారం సెలవు ఉంటుంది. బక్రీద్, రాజా సంక్రాంతి పండగలకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు.
# ఎమిషన్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టి, వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఉద్ఘారాలు ఉత్పత్తి చేసే వెహికల్స్ తగ్గించాలి అని నిర్ణయించుకున్నారు. తొమ్మిది లక్షల పాత ప్రభుత్వ వాహనాలని ఆపేయాలి అని అనుకుంటున్నారు.
# ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14వ తేదీ వరకు గడువుని విధించారు. ఈ అప్డేట్ ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 50 రూపాయలు చెల్లించి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి.
జూన్ నెలలో రాబోతున్న మార్పులు ఇవే.
End of Article