ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం డైలాగ్స్.

ఇవి కూడా చదవండి: “ఆ టైంలో ప్రేక్షకులు నన్ను మర్చిపోవాలి అని కోరుకుంటున్నాను..!” సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ.

ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ కి ఎంత పెద్ద గుర్తింపు వచ్చిందో అందరికీ తెలుసు. హీరో పాత్రలో యష్ కాకుండా మరెవరైనా చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ ఈ సినిమాలో మొదటిగా వేరే స్టార్ హీరోని అనుకున్నారు. ప్రశాంత్ నీల్ ఈ కథ అనుకున్నప్పుడు ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తే బాగుంటుంది అనుకొని హృతిక్ రోషన్ ని కలవడానికి చాలా ప్రయత్నించారట. కానీ హృతిక్ రోషన్ ని కలిసే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు.

first choice for hero in kgf

దాంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పది అనేది పాన్ ఇండియన్ లెవెల్ లో చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే కన్నడ హీరోతోనే ఎలాగైనా సరే ఈ సినిమా చేద్దామని అనుకున్నారు. ప్రశాంత్ నీల్ అనుకున్నట్టే యష్ తో ఈ సినిమా తీశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా హీరో యష్ కూడా ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యారు. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నారు. మొదటి పార్ట్ కి మాత్రమే కాకుండా, రెండవ పార్ట్ కి కూడా చాలా మంచి గుర్తింపు లభించింది.

ఇవి కూడా చదవండి: హీరో ఆ పాత్ర చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందా.? ఈ 4 సినిమాలకి అలాగే అయ్యిందిగా.?