Ads
మలయాళీ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త సినిమా సీతా రామం. శుక్రవారం రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. మలయాళ నటుడు అయినా సరే దుల్కర్ సల్మాన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. మహానటి సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు దుల్కర్ సల్మాన్.
Video Advertisement
ఇందులో దుల్కర్ సల్మాన్ పాత్రకి చాలా మంచి స్పందన లభించింది. దాంతో తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఆ సినిమాలు అన్నిటికీ కూడా దుల్కర్ సల్మాన్ స్వయంగా తనే తెలుగులో డబ్ చేసుకుంటున్నారు.
ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మధ్య రొమాంటిక్ ప్రేమ కథకు ప్రేక్షకులను ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు. అసలు ఈ సినిమా లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కంటే ముందు పూజా హెగ్డే సెలక్ట్ చేయబడింది. కానీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని షూటింగ్ కి రెడీ అయ్యే టైంకి పూజా హెగ్డే కోవిడ్ బారిన పడ్డారు. అప్పటికే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరగడంతో షూటింగ్ డిలే చేయలేని పరిస్థితుల్లో పూజా హెగ్డే స్థానంలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.
ఇంత మంచి ఎమోషనల్ ప్రేమ కథ ను కరోనా మహమ్మారి కారణంగా పాపం పూజా మిస్ అయింది. రీసెంట్ గా పూజ నటించిన రాధే శ్యామ్ కూడా రొమాంటిక్ లవ్ స్టొరీ అయినప్పటికీ ,ఆ మూవీ ఊహించినంత సక్సెస్ ఇవ్వకపోవడంతో పూజా కి నిరాశ మిగిలింది. కనీసం సీతా రామం సినిమాలో నటించి ఉన్నట్లయితే రాధే శ్యామ్ వల్ల కలిగిన నిరాశ కొంత అయినా తగ్గేది. ఈ చిత్రంలో సీత క్యారెక్టర్ పూజ చేసి ఉంటే ఆమెకు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ కి చేరుకునేదని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
End of Article