“గాడ్ ఫాదర్” సినిమా కోసం మొదటిగా అనుకున్న… ఆ పాన్-ఇండియన్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

“గాడ్ ఫాదర్” సినిమా కోసం మొదటిగా అనుకున్న… ఆ పాన్-ఇండియన్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Video Advertisement

అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

chiranjeevi god father teaser bgm copied from a recent telugu song

గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు నటించడంతో, సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం మొదటిగా అనుకున్న డైరెక్టర్ మోహన్ రాజా కాదు. ఈ సినిమాకి రన్ రాజా రన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుజిత్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ విషయంపై అప్పుడు ప్రకటన కూడా వచ్చింది.

first choice of director for chiranjeevi god father movie

ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా ఈ సినిమా డైరెక్టర్ మోహన్ రాజా అని ప్రకటించారు. రన్ రాజా రన్ తర్వాత సుజిత్ సాహో సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ కొంత మంది ప్రేక్షకులు మాత్రం సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా టేకింగ్ చాలా బాగుంది అని సుజిత్ ని మెచ్చుకున్నారు. తర్వాత చిరంజీవి హీరోగా సినిమా చేస్తున్నారు అని, ఈ సినిమాతో సుజిత్ కూడా మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటారు అని అనుకున్నారు. కానీ సుజిత్ ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నారు అనే విషయం మాత్రం తెలియదు.


End of Article

You may also like