RRR లో “హీరో”ల పాత్రలకి… ముందు అనుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసా..?

RRR లో “హీరో”ల పాత్రలకి… ముందు అనుకున్న యాక్టర్స్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.

rrr movie review

ఈ సినిమాలో హీరోల పాత్రల్లో వారిద్దరిని తప్ప వేరే వారిని ఊహించుకోలేము. కానీ ఈ పాత్రలకి ముందుగా అనుకున్న హీరోలు వీరు కాదట. హీరో పాత్రలకి వేరే ప్రముఖ హీరోలని అనుకున్నారు. ఈ సినిమాకి మొదట హీరోలని అనుకోలేదు. తర్వత రజినీకాంత్ అర్జున్ అనుకున్నారు. ఆ తర్వాత రియల్ లైఫ్ బ్రదర్స్ అయిన సూర్య-కార్తీలని హీరోలుగా అనుకున్నారు. కానీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లని హీరోగా అనుకున్నారు.

అందుకు ఒక కారణం ఏంటంటే వీరిద్దరూ నిజజీవిత స్నేహితులు. ఈ సినిమాలో కూడా వీరిద్దరూ స్నేహితుల్లాగా నటించారు. కాబట్టి వీరిద్దరు అయితేనే పాత్రలకి కరెక్ట్ గా సరిపోతారు అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే వీరిద్దరూ ఈ పాత్రలకి బాగా సూట్ అయ్యారు. సినిమా చూస్తున్నంత సేపు వీరిద్దరూ పెద్ద స్టార్ హీరోలు అనే విషయం మనం మర్చిపోతాం. కేవలం వారు పోషిస్తున్న పాత్రలు మాత్రమే మనకి కనిపిస్తుంటారు. అందుకే ఈ రెండు పాత్రల్లో వారిద్దరినీ తప్ప ఇంకెవరినైనా కూడా ఊహించుకోవడం కష్టమే ఏమో.


End of Article

You may also like