Home Filmy Adda బాలకృష్ణ ప్రోగ్రాంలో మొదటి అతిథులుగా రాబోతున్న “స్టార్ కుటుంబం” ఎవరో తెలుసా.?

బాలకృష్ణ ప్రోగ్రాంలో మొదటి అతిథులుగా రాబోతున్న “స్టార్ కుటుంబం” ఎవరో తెలుసా.?

by Mohana Priya

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు.

first guest in balakrishna unstoppable program

ఇందులో, “మొదటి ఎపిసోడ్ లో గెస్ట్ గా ఎవరు వస్తారు?” అనే విషయంపై ఆసక్తి నెలకొంది. చాలా మంది, “నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా అతిథిగా వస్తారేమో” అని అన్నారు. కానీ మొదటి ఎపిసోడ్ కి మంచు కుటుంబం వారు అతిథులుగా రాబోతున్నారు. మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఈ ప్రోగ్రాంకి అతిధులుగా రాబోతున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రోగ్రాం నవంబర్ 4వ తేదీ నుండి మొదలవుతుంది.

You may also like