5 కోట్లు పెట్టి తీస్తే…110 కోట్లు వసూలు చేసింది…ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ ని మించి రికార్డ్.! ఈ సినిమా చూసారా.?

5 కోట్లు పెట్టి తీస్తే…110 కోట్లు వసూలు చేసింది…ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ ని మించి రికార్డ్.! ఈ సినిమా చూసారా.?

by Harika

Ads

కొన్ని కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి ఇండియాలో మంచి వసూళ్లను నమోదు చేసుకుంటాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లనే సంపాదిస్తాయి. ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలను పెట్టి తీస్తే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి అని నమ్ముతారు. చాలా సంఘటనలు అలా జరిగాయి కూడా.

Video Advertisement

అలాంటి వాటిలలో ఆర్ఆర్ఆర్, దంగల్,బాహుబలి లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల కలెక్షన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఓవర్సీస్ లో ఈ సినిమాలని మించిపోయి కలెక్ట్ చేసిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా మరేదో కాదు మాన్సూన్ వెడ్డింగ్. ఇది ఏకంగా ఓవర్సీస్ లో 100 కోట్లను సంపాదించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.

బాహుబలి, దంగల్ వంటి పెద్ద పెద్ద చిత్రాలకే రాని కలెక్షన్లు ఈ సినిమాకి వచ్చాయి. ఈ సినిమా కధ చాలా సింపుల్ గా అందరికీ నచ్చినట్టు ఉంటుంది. కంటెంట్ బాగుంది అని థియేటర్లకు అభిమానులు తరలివచ్చారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం 5కోట్ల బడ్జెట్ తోనే రూపొందించిన సినిమా. ఏకంగా 110 కోట్ల వరకు సంపాదించింది. ప్రాఫిట్ ల ప్రకారం దంగల్ సినిమా రేంజ్ ని కూడా దాటేసింది.

ఎందుకంటే దంగల్ 75 కోట్ల బడ్జెట్ తో తీస్తే అన్ని కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఐదు కోట్ల తో నే ఓవర్సీస్ లో దంగల్ కి వచ్చిన వంటి కలెక్షన్లు సంపాదించుకుంది. రాజ్ కుమార్ హిరానీ తీసిన త్రీ ఇడియట్స్ మూవీ ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీ గా ఉండేది కానీ ఈ సినిమా కలెక్షన్లు ఆ రికార్డుని బ్రేక్ చేశాయి. దీని బట్టి అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడైనా రాణించగలవు.


End of Article

You may also like