ఎంతో కాలం నుండి సూపర్ స్టార్ రజనీ కాంత్ గారికి సింగర్ మనో గారు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. అంతకుముందు బాషా సినిమాకి సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పారు. కథానాయకుడు సినిమాకి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. కానీ చాలా సినిమాలకు మాత్రం మనో గారు డబ్బింగ్ చెప్పారు. అయితే మనో గారు రజినీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పడం గురించి ఇటీవల అలీతో సరదాగా ప్రోగ్రాంలో మాట్లాడారు.mano rajnikanth

అందులో మాట్లాడుతూ రజనీకాంత్ గారికి తను మొదటి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏదో కూడా చెప్పారు. మనో గారు రజనీ కాంత్ గారికి మొట్టమొదటిసారిగా ముత్తు సినిమాకి డబ్బింగ్ చెప్పారట. తర్వాత నుండి ఒక కథానాయకుడు సినిమాకి తప్ప మిగిలిన అన్ని సినిమాలకు మనో గారే డబ్బింగ్ చెప్పారు. శివాజీ సినిమాకి మనో గారు చెప్పిన డబ్బింగ్ నచ్చి రజినీకాంత్ గారు ఫోన్ చేసి మెచ్చుకున్నారట. ఈ విషయాన్ని అలీతో సరదాగా ప్రోగ్రాం లో మనో గారు ప్రేక్షకులతో పంచుకున్నారు.