Home Filmy Adda “తను హ్యాపీ… నేను హ్యాపీ.!” అంటూ… “విడాకులపై” మొదటిసారి మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య..!

“తను హ్యాపీ… నేను హ్యాపీ.!” అంటూ… “విడాకులపై” మొదటిసారి మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య..!

by Mohana Priya

ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అయిన సమంత, నాగ చైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇటు అభిమానులు, అటు సినీ తారలు సైతం విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదు.

విడాకుల తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇటీవల పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత, ప్రస్తుతం ఒక హాలీవుడ్ సినిమా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి తమిళ్ సినిమా, అలాగే యశోద, అంతే కాకుండా ఇంకొక హిందీ వెబ్ సిరీస్ కూడా సమంత చేయబోతున్నట్లు సమాచారం.

sri reddy about naga chaitanya samantha divorce

సమంత నటించిన యశోద సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇక నాగ చైతన్య విషయానికొస్తే, నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు నాగ చైతన్య. ఎన్నో ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు.

first reaction video of naga chaitanya about divorce

ఇదిలా ఉండగా, నాగ చైతన్య ఇటీవల మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడుతున్నట్టు అర్థమవుతోంది. నాగ చైతన్య మాట్లాడుతూ, “ఇది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్. తను సంతోషంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. ఈ సమయంలో ఇద్దరికీ ఇదే బెస్ట్ డెసిషన్ అని అనిపించింది” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

You may also like