Ads
తెలంగాణ వాహనాల నెంబర్లు TG పేరుతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. స్పెషల్ నెంబర్ల కోసం హైదరాబాదులో ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించారు ఆర్టిఏ అధికారులు. అయితే ఈ బిడ్డింగ్ కి ఊహించని స్పందన లభించింది. అధిక రేటుకి మొదటి TG నెంబర్ అమ్ముడుపోయి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ స్పెషల్ నెంబర్స్ ఏంటి, ఎంత రేటు పలికింది అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
శుక్రవారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు తొలి రోజు ఆర్టిఏ అధికారులు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించగా అనూహ్య స్పందన వచ్చింది. ఖైరతాబాద్ లో నిర్వహించిన బిడ్డింగ్ లో TG09 0001 నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని ఏకంగా 9.6 లక్షలు ఖర్చుపెట్టి సొంతం చేసుకున్నాడు. ఒక వాహన రిజిస్టర్ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ డబ్బుతో అతను మరొక కారు కొనుక్కోవచ్చు అంటూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఇదే TG తొలి నెంబర్ అని తెలుస్తోంది. ఇక భవ్య సింధు ఇన్ ఫ్రా సంస్థ TG 09 0909 నెంబర్ కోసం ఏకంగా 2.30 లక్షలు చెల్లించి ఆ నెంబర్ ని సొంతం చేసుకుంది. మరొక వాహన యజమాని అయిన శాన్వితారెడ్డి 2.21 లక్షలు ఖర్చుపెట్టి TG 090005 అనే నెంబర్ ని సొంతం చేసుకుంది. అయితే వాహనాలను కొనటం ఎంత క్రేజ్ గా ఫీల్ అవుతారో దానికి సంబంధించిన నెంబర్ల విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటారు చాలామంది వాహనం దారులు.
లక్కీ నెంబర్లని, స్పెషల్ నెంబర్లని ఆప్షన్స్ వస్తే మాత్రం వాటి కోసం లక్షలు ఖర్చుపెట్టి ఆ నెంబర్స్ ని సొంతం చేసుకుంటారు.అయితే మరీ ఈ రేంజ్ లో ఖర్చు పెడతారని ఆర్డిఏ అధికారులు సైతం ఊహించి ఉండరు. వీరికి తొలిరోజు ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా ఎంత సంపాదన వచ్చిందంటే సికింద్రాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి తొలి రోజు 8.52 లక్షల ఆదాయం వచ్చింది, బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి 3.32 లక్షల ఆదాయం వచ్చింది, టోకీచౌకి కార్యాలయానికి 5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది.
End of Article