వరుసగా ప్లాప్ లు… అయినా చేతి లో 5 సినిమాలు..! రకుల్ అదృష్టం మాములు గా లేదుగా..?

వరుసగా ప్లాప్ లు… అయినా చేతి లో 5 సినిమాలు..! రకుల్ అదృష్టం మాములు గా లేదుగా..?

by Megha Varna

Ads

తెలుగులో పలు సినిమాల్లో నటించి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చేసి ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.

Video Advertisement

చాలా మంది టాప్ హీరోల సరసన ఈమె నటించారు కూడా. అభినయంతో అందంతో ఈమె ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు.

rakul preeth

ఇప్పుడు తెలుగు సినిమాలకు కాస్త దూరం అయ్యారు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్.  2021లో చూస్తే.. ఈమె కొండ పాలెం సినిమా లో నటించారు ఆ తర్వాత మరి ఏ తెలుగు సినిమాల్లో కూడా ఈమె నటించ లేదు. ఈ సినిమా తర్వాత ఈమె కేవలం బాలీవుడ్ లో మాత్రమే నటించారు.

7 rakul

వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయి పోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్. అయితే రకుల్ ప్రీత్ సింగ్ అదృష్టమో దురదృష్టమో తెలియడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో వరుసగా ఐదు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. కానీ ఐదు సినిమాలు ఇంకా చేతి లో వున్నాయి. వీటిలో అయలన్, ఇండియా -2 కూడా వున్నాయి. కానీ బాలీవుడ్ లో వరుసగా ఐదు ఫ్లాప్స్ వున్నా కూడా ఐదు సినిమాలు ఇంకా చేతిలో ఉండడం గమనార్హం. దేవుడా ఈమె అదృష్టం మాములుగా లేదు.


End of Article

You may also like