ఏమి కావాలో తినండి.ఏమి కావాలో తాగండి.కాని 50% మాత్రమే బిల్ కట్టండి.

ఏమి కావాలో తినండి.ఏమి కావాలో తాగండి.కాని 50% మాత్రమే బిల్ కట్టండి.

by Megha Varna

Ads

కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావాలన్న బయట ఫుడ్ తినాలన్న భయపడిపోతున్నారు.దీనితో రెస్టారెంట్ లు,హోటల్ బిజినెస్ లు పూర్తిగా నష్టాల బాట పడుతున్నాయి.దీంతో అర్థిక వ్యవస్థ పై మరింత భారం పెరుగుతుంది.అందుకే ప్రభుత్వం మీరు ఎంతైనా తినండి కాని 50% బిల్ కట్టండి అని ఒక కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Video Advertisement

ఆగండి….ఆగండి..మన దేశంలో అందరూ భోజన ప్రియులని తెలుసు అందుకే మన దేశంలో ఇలాంటి ఆఫర్స్ ఉండవు.ఇక విషయంలోకి వెళదాం.యూకేలో ఇటీవల లాక్‌డౌన్ ను ఎత్తేశారు.దానితో అక్కడి రెస్టారెంట్లు ఓపెన్ చేయమని ప్రభుత్వం అనుమతలు ఇచ్చింది.కాని ప్రజలు వైరస్ భయంతో సరిగ్గా బయటకే రావట్లేదు.దాని ఫలితంగా హోటల్ బిజినెస్ లు మళ్లీ మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అందుకే బ్రిటన్ ఆర్థిక శాఖా మంత్రి రిషి సునాక్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘మినీ బడ్జెట్’లో ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ (Eat out to Help out) అనే డిస్కౌంట్ ను ఆహారం మరియు నాన్-ఆల్కహాలిక్ డ్రింకులపై ప్రతి వారం సోమవారం నుండి బుధవారం వరకు ఇస్తామని పేర్కొన్నారు.ఈ ఆఫర్ ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుందని.ప్రజలు దీన్ని వీలైనంత మేర వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


End of Article

You may also like