Ads
చాలా మంది ఎక్కువగా బయట ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలా ఆహార పదార్థాలను కల్తీ చేసి తయారు చేయడం జరుగుతుంది. వీటిని కనుక తిన్నామంటే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి నెగ్లెక్ట్ చేయకూడదు.
Video Advertisement
ఒకవేళ కనుక ఇలాంటి ఆహార పదార్థాల్ని తిన్నామంటే ఆరోగ్యం అంతా కూడా చెడిపోతుంది. పైగా బయట అమ్మే ఆహారపదార్ధాలను చేసేటప్పుడు హైజీన్ ని పాటించరు.
అలాంటి ఆహార పదార్థాలు తిన్నామంటే లేనిపోని రోగాలు కొని తెచ్చుకున్నట్లే. ఈ వీడియోని చూసినట్లయితే ఫుడ్స్ స్కామ్స్ గురించి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో లో ఒక అతను ప్యాకింగ్ చేసేటప్పుడు ఆహారపదార్థాలను నాకుతూ ప్యాకింగ్ చేస్తున్నాడు. అలాగే పానీ పూరి లో ఒకతను మూత్రాన్ని కలపడాన్ని కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు.
రోడ్డు పక్కన తయారుచేసే పానీపూరి వంటివాటిని ఇష్టమొచ్చినట్లు తయారు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళ నుంచి పిల్లలు వరకు దీనిని ఇష్టపడుతున్నారు. అలానే చెయ్య లేని అతను పిండిని ఏ విధంగా నూనెలో వేస్తున్నాడు అనేది కూడా చూడొచ్చు. మీరు కనుక వీటిని కనుక చూశారంటే బయట ఫుడ్ కి మీరు చాలా దూరంగా ఉంటారు.
ఈ వీడియోని చూస్తే బయట ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తినే వాళ్ళకి కూడా అసహ్యం కలుగుతుంది. వీటికి బదులుగా మనం ఇంట్లో చక్కగా ఆహార పదార్థాలను మంచి నీటితో కడిగి వండుకుని తింటే మంచిది. పైగా ఈ రోజుల్లో ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. అలాంటప్పుడు మనం ఆరోగ్యాన్ని మరింత ఇబ్బందులు పెట్టుకోకూడదు. వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది.
దీంతో ఆరోగ్యానికి ముప్పు ఉండదు. పైగా లేనిపోని ఆహారపదార్థాలను తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన పని ఉండదు కాబట్టి ఒక్కసారి ఈ వీడియోని చూసి బయట ఎలా తయారు చేస్తున్నారు అనేది తెలుసుకుంటే మంచిది. మరి మీరూ ఆ వీడియోని చూసేయండి.
End of Article