Ads
ఇంట్లో మనం మనకి కావలసిన వస్తువులు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి తీసుకు వెళ్లాలని మొత్తానికి అసలు అక్కడికి ఎందుకు వెళ్లామనేది మర్చిపోయి తిరిగి వస్తూ ఉంటాము. ఇదే చాలా మందిలో జరుగుతుంది. మీలో కూడా ఈ సమస్య వచ్చిందా..? ఏదైనా వస్తువుని తెచ్చుకోవాలని ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లడం… అసలు ఎందుకు ఆ గదిలోకి వెళ్లామనేది మర్చిపోయి తిరిగి రావడం జరుగుతూ ఉంటాయి. అయితే తప్పకుండా మీరు దీని కోసం తెలుసుకోవాలి. మరి వీటి కోసం ఓ లుక్ వేసేయండి.
Video Advertisement
యూఎస్ లోని నోట్రేడాం యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేయడం జరిగింది. 2011 లో దీనిపై అధ్యయనం చేసి డోర్ వే ఎఫెక్ట్ అని దానికి పేరు పెట్టారు. అయితే దీనిని లొకేషన్ అప్ డేటింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఒక గది నుంచి మరొక గదిలోకి వెళ్ళినప్పుడు ముందు గదిలో ఉన్న ఆలోచనలని, జ్ఞాపకాలని మెదడు చెరిపేస్తుంది. అయితే గదులకి సరిహద్దులు ఉండటం వల్లే ఇలా జరుగుతుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే దీని మీద పూర్తిగా క్లారిటీ లేదు.
రీసెంట్ గా బీఎంసీ సైకాలజీ జర్నల్ లో ఈ ఎఫెక్ట్ కి గల కారణాన్ని బయట పెట్టడం జరిగింది. మెదడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది వస్తుంది. సాధారణంగా మన మెదడు చాలా ఎక్కువగా పని చేస్తుంది. అలాగే తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటుంది. దీని కారణంగానే ఒక గదిలో నుంచి మరొక గదిలోకి వెళ్ళగానే మనం అనుకున్నది మర్చిపోతామట. అయితే దీనిని నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు వర్చువల్ గా కొన్ని త్రీడి గదులని చూపించి మొదటి గదిలో ఉన్న వస్తువుల్ని గుర్తుపెట్టుకుని.. రెండవ గదిలోకి తీసికెళ్లి చెప్పమన్నారు.
దీంతో అక్కడ చూసిన వస్తువులని చెప్పారు. అయితే ఇప్పుడు తిరగేసి అంకెలను చెపుతూ గదిలో ఉండే వస్తువులను గుర్తు పెట్టుకోమని అన్నారు. రివర్స్ లో నెంబర్స్ చెప్పడం నిజంగా సులువు కాదు. మెదడుకి పని ఎక్కువ అవుతుంది. దీనితో గుర్తుండవు. కాబట్టి ఎక్కువ ఒత్తిడి వున్నా, ఎక్కువ పనులు ఉన్నా మనం అనుకున్నది చేయడం మర్చిపోతాం. గదుల్లో సరిహద్దుతో పాటు గదిలో వాతావరణంపై కూడా ఎఫెక్ట్ అవుతుంది.
End of Article