Ads
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి నిన్న సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.
Video Advertisement
అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పైన చర్చించారు. ఎప్పటినుండి అమలు చేయాలి ఎలా అమలు చేయాలి దానికి నిబంధనలు ఏంటి అనేది మంత్రులతో పాటు అధికారులు ఈ సుదీర్ఘ సమావేశంలో పాల్గొని చర్చించారు.
అయితే వీటిలో రెండు గ్యారెంటీలు డిసెంబర్ 9వ తారీకు నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటిలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. డిసెంబర్ 9 తారీఖున సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. అయితే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించాలని అన్నారు.
ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఈ ఫ్రీ సర్వీసులో వచ్చే సమస్యలను, ఏదైనా ఇబ్బందులు ఉంటే భవిష్యత్తులో వాటికి పరిష్కారాలు చూపి దానికి అనుగుణంగా నిబంధనలు తయారు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఈ లెక్కన చూస్తే డిసెంబర్ 9 నుండి తెలంగాణలో బస్సులో ప్రయాణించే ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించవచ్చు. తమ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అన్ని బంధాలు ప్రకారం వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది.
End of Article