ఫ్రీ బస్సు పెడితే అధికారం ఖాయమా… చూస్తుంటే అలానే ఉంది…!

ఫ్రీ బస్సు పెడితే అధికారం ఖాయమా… చూస్తుంటే అలానే ఉంది…!

by Mounika Singaluri

Ads

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లో భాగంగా మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడ వరకు అయినా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది.

Video Advertisement

ఈ పథకం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ ప్రతి చోటా అధికారంలోకి వస్తుంది. తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్టుగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అదే తరహాలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇదే పథకాన్ని పెట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ తన మినీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకాన్ని ప్రకటించిన పార్టీలన్నీ అధికారులకు వచ్చాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన కూటమి అధికారంలోకి రావచ్చునని అంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అనేది ఇప్పుడు ఒక సెంటిమెంట్ గా మారిన ఆశ్చర్యపోవక్కర్లేదు.


End of Article

You may also like