Ads
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఖాజా రసూల్ జీవనోపాధి కోసం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ చాంద మండలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.సోమవారం నాడు తనతో పని చేసే నలుగురు మేస్త్రిలతో కలిసి విందు చేసుకున్నారు.ఈ సమయంలో ఐదుగురు కలిసి ఓ ఫుల్ బాటిల్ ను కంప్లీట్ చేశారు.
Video Advertisement
ఆతరువాత మందు మత్తులో ఇరవై నిమిషాల్లో పుల్ బాటిల్ ఖాళీ చేస్తే రూ. 20 వేలు బహుమతిగా ఇస్తామని మిత్రులు రసూల్ తో ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ కి రసూలు ఒప్పుకొన్నాడు. మిత్రులు నాలుగు క్వార్టర్ సీసాలు తెప్పించారు. రెండు క్వార్టర్ సీసాలు అలవోకగా తాగేశాడు.మూడో బాటిల్ తాగేటప్పుడు ఉన్నటుండి స్పృహ కోల్పోయాడు.
అతన్ని అంబులెన్స్ లో ఆసుపత్రి తరలించే లోపు మరణించాడు.రసూలు మరణానికి కారణమైన రత్తయ్య, నాగూరుబాషాలపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్టుగా ఆ ఏరియా సీఐ జీవన్ రెడ్డి తెలిపారు…
End of Article