Home Filmy Adda సుకుమార్ బన్నీకి “పుష్ప” కథ ఇలాగే చెప్పుంటారా..? వైరల్ అవుతున్న ఈ ఎడిట్ చూస్తే నవ్వాపుకోలేరు..!

సుకుమార్ బన్నీకి “పుష్ప” కథ ఇలాగే చెప్పుంటారా..? వైరల్ అవుతున్న ఈ ఎడిట్ చూస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

funny edit of sukumar narrating pushpa script to allu arjun goes viral

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

funny edit of sukumar narrating pushpa script to allu arjun goes viral

అయితే, ఇదిలా ఉండగా, సుకుమార్ బన్నీకి ఈ సినిమా కథ ఇలాగే చెప్పి ఉండొచ్చు ఎమో అని ఒక ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేనింతే సినిమాలో వేణు మాధవ్ సుబ్బరాజుకి కథ చెప్పే సీన్‌కి అల్లు అర్జున్, సుకుమార్ ఫోటోలు ఎడిట్ చేసి ఈ వీడియోని ఒక మీమ్ పేజ్ పోస్ట్ చేసింది. అంతే కాకుండా మధ్యలో సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్, పాట కూడా యాడ్ చేశారు. దాంతో చాలా మంది నిజంగా సుకుమార్ అల్లు అర్జున్ కి ఇలాగే కథ చెప్పారేమో అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

watch video :

https://www.facebook.com/watch/?v=454434666307670

You may also like