Home Filmy Adda RRR “టికెట్ రేట్” 413 వెనక ఇంత లెక్క ఉందా.? ఈ ఫన్నీ లాజిక్ చూడండి.!

RRR “టికెట్ రేట్” 413 వెనక ఇంత లెక్క ఉందా.? ఈ ఫన్నీ లాజిక్ చూడండి.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని సినిమాలో చూపించబోతున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు.

ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అలాగే ఒలీవియా మోరిస్ కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియా సరన్ ఇంకా చాలామంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

rrr first song singers

సినిమా బృందం అంతా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌లో ఉంది. తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో సినిమా ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అమీర్ ఖాన్ అతిథిగా వచ్చారు.

funny logic behind rrr ticket rates

సినిమా టికెట్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆ టికెట్ ఖరీదు అంత ఎక్కువ ఉండదనికి కారణం అదేనేమో అని ఒక లెక్క వైరల్ అవుతోంది. అదేంటంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆర్ (R) అంటే 18. ఇందులో మూడు ఆర్ లు ఉన్నాయి. కాబట్టి 3*18 = 54. ఈ సినిమా కోసం ప్రేక్షకులు 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. అంటే 54+5 = 59. సినిమా రిలీజ్ అయ్యేది 25 వ తేదీ రోజు. అంటే, 2+5 = 7. కాబట్టి 59*7 = 413. అందుకే ఈ సినిమా టికెట్ ధర 413. ఈ లెక్కని అన్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ పేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

You may also like