Home Filmy Adda “దీనమ్మా ఇదెక్కడి మోసం పూర్ణ మావా?” … మజిలీలో ఇది ఎప్పుడూ గమనించలేదే.!

“దీనమ్మా ఇదెక్కడి మోసం పూర్ణ మావా?” … మజిలీలో ఇది ఎప్పుడూ గమనించలేదే.!

by Mohana Priya

రియల్ లైఫ్ కపుల్ నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా 2019 లో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాతో దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

పెళ్లి అయిన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో కూడా సినిమా విడుదల అవ్వడానికి ముందే ఎంతో ఆసక్తి మొదలైంది. ప్రేక్షకుల అంచనాలను అందుకొని మజిలీ కూడా ఎంతో పెద్ద విజయం సాధించింది. అయితే, ఏ సినిమా అయినా సరే విడుదల అయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, ఎప్పుడో ఒకసారి అందులో ఏదో ఒక విషయం సోషల్ మీడియా లైమ్ లైట్ ఫోకస్ లో పడుతుంది.

Majili movie mistake

అలా మజిలీ సినిమాలోని ఒక విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటంటే, ఫ్లాష్ బ్యాక్ తర్వాత పూర్ణ, అన్షు కూతురు మీరాని క్రికెట్ ట్రైనింగ్ కోసం విశాఖపట్నంలో ఉన్న తన ఇంటికి తీసుకువస్తాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అవడానికి వెళుతూ “బాత్రూంలో షవర్ లేదా?” అని అడుగుతుంది.

Majili movie mistake

అందుకు శ్రావణి “ఉంది కానీ పని చేయట్లేదు” అని చెప్తుంది. కానీ తర్వాత ఒక సీన్ లో శ్రావణి షవర్ కింద నిలబడి ఉన్నట్టు మనకు చూపిస్తారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో మీమ్ రాగా అందుకు నెటిజన్లు “తర్వాత రిపేర్ చేయించుకొని ఉంటారులే” అని కామెంట్స్ చేశారు.

Majili movie mistake

ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం తర్వాత నాగచైతన్య, సమంత కలిసి మళ్లీ మజిలీ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఒక మెయిన్ అట్రాక్షన్ గోపీసుందర్ అందించిన మ్యూజిక్. మజిలీ సినిమాకి మ్యూజిక్ గోపీసుందర్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించారు. మజిలీ సినిమా తర్వాత 2019 లో నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ చేశారు నాగచైతన్య.

Majili movie mistake

You may also like