Ads
ప్రపంచం ఎంత అప్డేట్ అయినా, ఎన్ని కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చినా, ప్రేక్షకుల టేస్ట్ ఎంత మారినా కూడా సూపర్ హీరోల క్రేజ్ మాత్రం ఎప్పటికి తగ్గదు. సూపర్ హీరోల సినిమాలు ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నాయి. వాటి ఒరిజినల్ వెర్షన్ రూపొందించేది ఇంగ్లీష్ లో అయినా కూడా, మిగిలిన భాషల్లో కూడా సూపర్ హీరోలకి అంతే క్రేజ్ ఉంటుంది. అందుకే సూపర్ హీరోల సినిమాల్లో కచ్చితంగా అన్ని భాషల్లోనూ విడుదల అవుతాయి. వాళ్ల పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా, అలాగే క్యాచీగా ఉంటాయి.
Video Advertisement
ఇంకొక విషయం ఏంటంటే చాలా సినిమాల్లో సూపర్ హీరోలు మనలా మామూలుగానే ఉంటారు. కానీ విలన్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ గాని సూపర్ హీరో బయటికి వస్తాడు. మనలో చాలా మంది చిన్నప్పుడు సూపర్ హీరోలని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లాగా అవ్వడానికి ప్రయత్నించే ఉంటాం.
స్పైడర్ మాన్ సినిమా చూసిన తర్వాత స్పైడర్ చేతి మీద పడితే స్పైడర్ మాన్ అవుతారు అని సాలీడుని చేతి మీద వేసుకొని స్పైడర్ మాన్ వేలు చూపించగానే బూజు వస్తుందేమో అని ట్రై చేసే ఉంటాం. ఇప్పుడంటే వాళ్ళ పేర్లు మనం చాలా సంవత్సరాల నుండి విని ఉన్నాం కాబట్టి సూపర్ మాన్ స్పైడర్ మాన్ ఐరన్ మాన్ అనంగానే సూపర్ హీరోలే గుర్తొస్తారు. కానీ ఒకసారి వాళ్ళ పేర్లు చూస్తే వాటి అర్థాలు డిఫరెంట్ గా ఉంటాయి. అలా సూపర్ హీరోల పేర్లకి సరదాగా మీనింగ్ ఉంటే ఇలా ఉంటుంది అనే దాని పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9
End of Article