అప్పుడు తిరుమలలో… ఇప్పుడు గురుద్వార్ లో..! మీరు చేస్తున్న పని ఏంటి..?

అప్పుడు తిరుమలలో… ఇప్పుడు గురుద్వార్ లో..! మీరు చేస్తున్న పని ఏంటి..?

by kavitha

Ads

ఇటీవల కాలంలో సినిమాల చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ కి వచ్చిన డైరెక్టర్ ఓం రౌత్, తిరుమలలో సీతగా నటించిన కృతి సనన్ ను హాగ్ చేసుకోవడం, ముద్దు పెట్టడం కాంట్రవర్సీ అయ్యింది.

Video Advertisement

పవిత్రమైన తిరుమల ఆలయం ముందు ఇలాంటి పని చేస్తారా అని భక్తులు, ఆలయ కమిటీ మండిపడ్డారు. డైరెక్టర్ ఓం రౌత్ పై కేసు నమోదు చేశారు. తాజాగా అలాంటిదే మరో పవిత్ర క్షేత్రంలో జరిగింది. ఈసారి ఏకంగా అలాంటి సీన్స్  షూట్ చేయడంతో అందరు మండిపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ముందు డైరెక్టర్ ఓం రౌత్, ‘ఆదిపురుష్’ లో సీతాదేవిగా నటించిన కృతి సనన్ తో  ప్రవర్తించిన తీరుకు అటు మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది మరవక ముందే ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సినిమా ‘గదర్ 2‘ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా అమీషా పటేల్ నటిస్తోంది. అయితే ‘గదర్ 2‘ మూవీ షూట్ తాజాగా గురుద్వార్ లో జరుగుతోంది. అయితే అక్కడ కౌగిలింతలు, ముద్దు సీన్స్ ను చిత్రీకరించారు. ఆ షూట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘గురుద్వార్’ సిక్కులకు పరమ పవిత్రమైన స్థలం. అలాంటి చోట దేవుడికి నమస్కరించే సీన్స్ తీస్తామని మూవీ యూనిట్ అనుమతి తీసుకుని, ఈ సీన్స్ ను షూట్ చేశారంట. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ గురుద్వారా ప్రాంగణంలో ఇలాంటి సీన్స్  చిత్రీకరించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుద్వార్ నిర్వాహకులతో పాటుగా, సిక్కు మతస్థులు మండి పడుతున్నారు. నెటిజెన్లు ‘ఇక మీరు మారరా’ అని బాలీవుడ్ సెలబ్రిటీల పై కామెంట్లు చేస్తున్నారు.

Also Read: తమ అభిమానులనే పెళ్లి చేసుకున్న 8 మంది సెలెబ్రిటీలు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!


End of Article

You may also like