Ads
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా చర్చల్లో ఉన్నాయి. ఇవాళ ఓటింగ్ కౌంట్ అవుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి కొన్ని నియోజకవర్గాల మీద ఉంది. అందులో నగరి నియోజకవర్గంలో కూడా ఒకటి. నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రోజా చేశారు. నగరి నియోజకవర్గానికి రెండుసార్లు రోజా ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, రెండుసార్లు గెలిచిన రోజా మీద, ఈసారి ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఆయన పేరు గాలి భాను ప్రకాష్. గాలి భాను ప్రకాష్ ఒక వ్యాపారవేత్త. గాలి భాను ప్రకాష్ తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు గారు.
Video Advertisement
42 సంవత్సరాల గాలి భాను ప్రకాష్, 1991 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ చేశారు. ఆ తర్వాత 1993 లో గుంటూరులో ఉన్న వికాస్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ చదివారు. 1997 లో హైదరాబాద్ లోనే MJ కాలేజ్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత 2000 లో యుఎస్ఎ లో ఉన్న, యూనివర్శిటీ ఆఫ్ బ్రిడ్జ్‌పోర్ట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. గాలి భాను ప్రకాష్ ఆస్తుల విలువ 18,02,58,498 కోట్లుగా తెలుస్తోంది. బాధ్యతల విలువ 7,59,72,601 కోట్లుగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయాల్లోకి రోజా వచ్చారు.
2004 లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రోజా పోటీ చేశారు. కానీ అప్పుడు కాంగ్రెస్ నేత అయిన చెంగారెడ్డి చేతిలో రోజా ఓడిపోయారు. 2009 లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సిపి లోకి రోజా వెళ్లారు. 2014 లో నగరి నుండి రోజా పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నేత అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి మీద 858 ఓట్ల తేడాతో రోజా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గాలి భాను ప్రకాష్ మీద 2708 ఓట్ల తేడాతో రోజా విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం మెజారిటీ ఓట్లు గాలి భాను ప్రకాష్ కి పడుతున్నాయి.
End of Article