గేమ్ చేంజర్ సినిమా అందుకే వాయిదా పడింది… క్లారిటీ ఇచ్చిన నిర్మాత…!

గేమ్ చేంజర్ సినిమా అందుకే వాయిదా పడింది… క్లారిటీ ఇచ్చిన నిర్మాత…!

by Mounika Singaluri

Ads

రాబోయే సంక్రాంతికి తెలుగులో అరడజన్ సినిమాలు రానున్నాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటించిన సైంధవ్, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నా స్వామి రంగా సినిమాలు పోటాపోటీగా వస్తున్నాయి.

Video Advertisement

అయితే థియేటర్లో కొరత కనబడుతున్న విషయంలో ఏ సినిమా వాళ్లు కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు పిలిచి మాట్లాడిన కూడా ఎవరు రాజీ పడేటట్టు కనబడడం లేదు. గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు జనవరి 12న డేట్లు ప్రకటించాయి.అయితే హనుమాన్ సినిమా వాళ్ళని వెనక తగ్గమని చెప్పిన తగ్గేదెలా అంటూ తేల్చి చెప్పేశారు. దీంతో సినిమాల మధ్య పోటీ తప్పేలా లేదు.

ఈ విషయం పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ… సంక్రాంతి సినిమాల మధ్య సయోధ్య కుదరచ్చడానికి ప్రయత్నిస్తున్నామని, ఎవరైనా ముందుకు వస్తే సోలో డేట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా తన స్వయంగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా వాయిదా పడడానికి గల కారణాలు కూడా తేలిపారు.

సంక్రాంతికి పోటీగా ఇన్ని సినిమాలు రానున్న నేపథ్యంలో గేమ్స్ చేంజర్ సినిమాని వెనక్కి వాయిదా వేసినట్లుగా తెలిపారు. అయితే ఇటువంటి పోటీ ఉన్న సమయంలో పెద్ద సినిమాకి పెద్దగా న్యాయం జరుగుతుందని, చిన్న సినిమాకి చిన్నగా న్యాయం జరుగుతుందని ఎవరికి సమానంగా న్యాయం జరిగే అవకాశం లేదని కూడా దిల్ రాజు ప్రకటించారు.


End of Article

You may also like