Ads
- టైటిల్ : గేమ్ చేంజర్
- నటీనటులు : సందీప్ కుమార్, యాంకర్ శివ, ఆల్ రౌండర్ రవి
- దర్శకత్వం : అనిరుధ్ గణేష్
- సంగీతం : ఆదిత్య చంద్ర శేఖర్
కథ
Video Advertisement
ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన షార్ట్ ఫిలిం గేమ్ చేంజర్. కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాము అని చెప్పి, వ్యాపార వివరాలు ఏమీ చెప్పకుండా డబ్బులు తీసుకొని అలాగే ఇంకొక ముగ్గురు వ్యక్తులను కూడా డబ్బు ఇన్వెస్ట్ చేయించమని చెప్పే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే ఒక వ్యక్తి కథ ఇది. తను అసలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోకి ఎందుకు వెళ్ళాడు? అందులో ఎలా ఎదిగాడు? తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలంటే షార్ట్ ఫిలిం చూడాల్సిందే.
రివ్యూ
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి. యాంకర్ సందీప్ యూట్యూబ్ లో చాలా మందికి తెలిసే ఉంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సందీప్ ని ప్రశంసించారు. తన ఏమనుకుంటే అదే మాట్లాడే ముక్కుసూటి స్వభావం ఉన్న రామ్ గోపాల్ వర్మ సందీప్ చేసిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ యాంకరింగ్ బాగా నచ్చింది అని, ఎక్స్టెంపోర్ (ఆన్ ద స్పాట్ ఆలోచించి మాట్లాడడం) గా ప్రశ్నలు అడిగినా కూడా, ఏ ఒక్క ప్రశ్న మళ్ళీ రిపీట్ చేయలేదు అని అభినందించారు.
అలాగే స్టార్ స్పోర్ట్స్, దూరదర్శన్ లో కూడా కామెంటేటర్ గా చేశారు సందీప్. ఇలా ఎంతో పేరు తెచ్చుకున్న సందీప్ నటనలో కూడా తనదైన శైలి లో బాగా పర్ఫార్మ్ చేశారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఎంతో ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ షార్ట్ ఫిలిం కేవలం రెండు రోజుల్లో షూట్ చేశారు.
watch video :
End of Article