గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రేపు విడుదలకి సిద్ధం అవుతోంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అంజలి మరొక ముఖ్య పాత్రలో నటించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా బృందం అంతా కూడా ఇప్పుడు ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు.

Video Advertisement

gangs of godavari first review

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది. అయితే సినిమా సెన్సార్ టాక్ బయటికి వచ్చింది. సెన్సార్ బృందం సినిమా చూశాక సినిమా బృందాన్ని చాలా మెచ్చుకున్నట్టు సమాచారం. సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక 80స్ కాలంలో సాగే సినిమా అని తెలుస్తోంది. సినిమా అంతా కూడా చాలా బాగా తీశారు అని క్లైమాక్స్ చాలా బాగుంది అని సెన్సార్ బృందం మెచ్చుకున్నారట. సినిమాకి రెండవ భాగం ఉంటుంది అని ఇప్పటికే సినిమా బృందం చెప్పారు. దానికి సంబంధించిన ఒక సీన్ క్లైమాక్స్ లో చూపిస్తారు. దానికి వివరణ రెండవ భాగంలో ఇస్తారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like