పొట్ట మీద 10 వేల తేనెటీగలతో గర్భిణి ఫోటో…ఎందుకలా చేసిందో తెలుస్తే షాక్ అవుతారు!

పొట్ట మీద 10 వేల తేనెటీగలతో గర్భిణి ఫోటో…ఎందుకలా చేసిందో తెలుస్తే షాక్ అవుతారు!

by Mohana Priya

Ads

ఈ మధ్య ప్రతి అకేషన్ కి ఫోటో షూట్ అనేది సాధారణమైపోయింది. పెళ్ళికి ముందు ఒక ఫోటో షూట్ పెళ్లి అయిన తర్వాత ఒక ఫోటో షూట్. తల్లి కాబోయే ముందు ఒక ఫోటో షూట్. తల్లి అయిన తర్వాత ఒక ఫోటో షూట్. అవి మళ్లీ సాధారణంగా ఫోటో దిగినట్లు కాకుండా ఫోటోగ్రాఫర్స్ వాటిని ఒక కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తారు.

Video Advertisement

ఇటీవల టెక్సాస్ కి చెందిన బేథానీ కరులక్ అనే ఒక మహిళ ప్రీ బేబీ ఫోటో షూట్ (అంటే పిల్లలు పుట్టే ముందు చేయించుకునే ఫోటో షూట్) చేయించుకున్నారు. ఆవిడ ఫోటో షూట్ చేయించుకున్న కాన్సెప్ట్ కొత్తగానే కాదు వింతగా కూడా ఉంది.

పొట్ట మీద దాదాపు పదివేల తేనెటీగల తో ఫోటోలు తీసుకున్నారు బేథానీ. సోషల్ మీడియా లో బేథానీ పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమందేమో ఎందుకు ఇలాంటి సాహసాలు చేయడం సీతాకోక చిలుకల తో నో ఫోటోలు తీయించుకోవచ్చు కదా? అని అంటున్నారు. మరి కొంతమందేమో ఆమె ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.

బేథానీ దీనిపై స్పందిస్తూ ” దయచేసి మీరు ఎవ్వరు ఇలాంటివి నిపుణుల సహాయం లేకుండా ప్రయత్నించకండి. నేను డాక్టర్ల అనుమతి తీసుకొనే ఈ ఫోటో షూట్ చేయించుకున్నాను. మొదట రాణి తేనెటీగ ను నా పొట్ట పై ఉంచారు. తర్వాత మిగిలిన తేనెటీగలు రాణి తేనెటీగ చుట్టూ గూడు కట్టుకున్నాయి.ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ మీ అందరికీ మామూలుగా అనిపిస్తుండొచ్చు. కానీ కాదు.

ఏడాది క్రితం నాకు మిస్ క్యారేజ్ అయింది. తర్వాత సర్జరీ అయింది. దాంతో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు క్షీణించాయి. కొన్ని నెలల తరువాత మళ్లీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది.

నెలలు గడిచే కొద్దీ నాలో భయం పెరుగుతూ వచ్చింది. మళ్లీ అప్పుడు అయినట్టు అవ్వకూడదు అనుకున్నాను.నా బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఫోటో చూసి తన తల్లి ఎంత ధైర్యవంతురాలో తెలుసుకోవాలని ఇలా చేశాను. కానీ ఇదంతా డాక్టర్ల సలహా తోనే చేసాము” అని అన్నారు. బేథానీ ఒక మానసిక నిపుణురాలు ఇంకా మోటివేషనల్ కోచ్. అడ్వెంచర్ అనేది బేథానీ కి కొత్తేం కాదు. బేథానీ మొదటి నుండి కూడా ఇలాంటి సాహసాలు ఎన్నో చేశారు.


End of Article

You may also like