కాలం మారుతున్నా చాలామంది అమ్మాయిలు ఇంకా ఘోర స్థితిలో ఉంటున్నారు. ఎన్ని మార్పులు వస్తున్నా చాలా మంది మహిళలు జీవితంలో మార్పు రాక సతమతమవుతున్నారు. నాడు నేడు కూడా ఆడపిల్లలు బాధపడుతూనే ఉన్నారు. బాధల్ని అనుభవిస్తూనే ఉన్నారు… కానీ ఈ కాలంలో ఆడపిల్లలు చదువుకోవడం ఉద్యోగం చేయడం చాలా ముఖ్యం.

Video Advertisement

ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి. ఆదిలక్ష్మి ఎందరికో స్ఫూర్తినిస్తోంది. కాకినాడ కి చెందిన ఆదిలక్ష్మి పేద కుటుంబంలో జన్మించింది.

ఆమెని తల్లిదండ్రులు ఎన్నారై కంభంపాటి సుశీల దేవి స్థాపించిన పాఠశాలలో జాయిన్ చేశారు. ఈ స్కూల్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఆదిలక్ష్మికి ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే పెళ్లి చేశారు అయితే పెళ్లి తర్వాత ఆమె చదువుకోవడానికి కుదరలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదువుకోవద్దని అత్తమామలు, భర్త ఒత్తిడి చేశారు. కానీ ఆమె తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు సహకరించడం వలన భర్తకు విడాకులు ఇచ్చేసింది. దీనితో చదువు పట్ల ఆమెకి పూర్తి స్వేచ్ఛ లభించింది. పనిమనిషిగా పని చేస్తూ ఆ డబ్బుతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఆదిలక్ష్మి. తర్వాత బీటెక్ లో జాయిన్ అయింది ఆదిలక్ష్మి.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ లో మూడు కంపెనీలు ఆమెకి జాబ్ ఆఫర్ ఇచ్చాయి. కానీ ఆమె వాటిని తిరస్కరించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయింది. ఇండో టిబిట్ పోలీస్ ఫోర్స్ కి ఆమె ఎంపికయింది. ఈ విషయం గురించి ఆదిలక్ష్మి మాట్లాడుతూ… పోలీస్ ఫోర్స్ కి ఎంపిక అవ్వడం నా లక్ష్యం కాదు ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని ఆమె అంది. బాల్య వివాహాల వలన చాలామంది ఆడపిల్లల జీవితం పాడవుతుంది. వాళ్ళ కన్న కలలకి దూరంగా ఉంటూ బాధపడుతున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. కానీ అందరూ ఆదిలక్ష్మిలా పట్టుదలతో శ్రమిస్తే సక్సెస్ అవ్వడం ఖాయం.