Ads
వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవి ఈమధ్య నిజ జీవితం లో జరిగే సంఘటనలను కథలుగా మార్చేస్తున్నారు. లాక్ డౌన్ టైం లో అందరూ ఉపాధి కోల్పోయి ఇప్పుడు ఎలా అని బాధ పడుతుంటే ఈయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అమృత, మారుతీ రావు అనే తండ్రి కూతుళ్ళ కథ అందరికీ గుర్తుంది కదా ఇప్పుడు ఆర్జీవి దానిపై చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్జీవి ఫాదర్స్ డే రోజు రిలీజ్ చేశారు.ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది.ప్రస్తుతం ఆ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Video Advertisement
ఇక ఈ తండ్రి కూతుర్ల గొడవలో నష్టపోయిన అమృత తల్లి పాత్రలో యాంకర్ గాయత్రి భార్గవి నటిస్తున్నారు.ఈమె తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజు పండగే చిత్రంలో హీరోకు అత్తగా నటించారు.ఇక ఆ చిత్రంలో అన్నగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ భార్యగా ఈ చిత్రంలో నటించడం విశేషం.
ఇక ఈ మర్డర్ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.మిగిలిన డీటైల్స్ త్వరలోనే విడుదల చేస్తాం.ఇక ఇదే శ్రావణ శుక్రవారం గిఫ్ట్ అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.దాని పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
End of Article