వయస్సులో తన కంటే చాలా పెద్దవారైపోయారని, లేదంటే ఆయన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని రామ్ గోపాల్ వర్మ గురించి కామెంట్ చేసి ఇప్పుడు సంచలనంగా మారింది నటి గాయత్రీ గుప్త. మీటూ పేరుతో తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి నెట్ ఇంట్లో హల్చల్ చేసిన గాయత్రికి సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా మంచి పేరు సంపాదించుకున్న గాయత్రీ.. ఆ తరువాత అడపాదడపా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు గాయత్రీ.

Video Advertisement

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఐస్‌క్రీమ్ 2’ సినిమాలో నటించిన విషయం గురించి ప్రస్తావించింది. ఆర్జీవి లాంటి మంచివాడిని తాను ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడలేదంది. తాను వ్యక్తిగతంగా తెలిస్తేనే ఎవరి గురించైనా ఓ అభిప్రాయానికి వస్తానని అంది. మూవీ షూటింగ్ సమయంలో షాట్ అయిపోయాక క్షణం కూడా ఉండేవాడు కాదని తెలిపింది. ఆయనతో సినిమా చేయడం అంటే మ్యారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటది.వయసులో ఆయన నా కంటే పెద్దవారు అయిపోయారు కానీ లేదంటే పెళ్లి చేసుకునేదాన్ని. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటే చాలు అనిపిస్తుంది.

ఇక ఇటీవల వర్మను గుప్తా హగ్ చేసుకున్న ఓ ఫొటో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. దానిపై స్పందిస్తూ …ఆయన ‘బ్యూటిఫుల్’ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ ఉంటే రమ్మన్నారు. వర్మపై గౌరవం, అభిమానంతో అక్కడకు వెళ్ళాను. అదే అభిమానంతోనే ఆయనను హగ్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది గాయత్రీ గుప్త.