జెనీలియా రీ ఎంట్రీ? ఈ సారి నెగటివ్ రోల్ లోనా? ఎవరి సినిమాలో?

జెనీలియా రీ ఎంట్రీ? ఈ సారి నెగటివ్ రోల్ లోనా? ఎవరి సినిమాలో?

by Megha Varna

Ads

ఒకప్పుడు యూత్ అంతా కూడా ఎంతగానో ఇష్టపడిన హీరోయిన్ జెనీలియా.చిన్నపిల్లలా చాలా క్యూట్ గా ఉంది అంటూ అమ్మాయిలు కూడా జెనీలియా స్టైల్ ను అనుసరించేవాళ్ళు.సత్యం చిత్రం తో టాలీవువుడ్ కు పరిచయం అయ్యారు జెనీలియా.కాగా తెలుగు లో కొంతమంది స్టార్ హీరోలతో నటించారు జెనీలియా.తరువాత పలు బాలీవుడ్ హిట్ చిత్రాలలో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు జెనీలియా.

Video Advertisement

జెనీలియా అంటే ప్రేక్షకులకు మొదటగా గుర్తుకొచ్చింది మాత్రం బొమ్మరిల్లు చిత్రమే.ఎందుకంటే ఆ చిత్రంలో హాసిని గా తాను చేసిన నటనకు ఇప్పటికి మన్ననలు అందుకుంటున్నారు జెనీలియా.హాసిని అని ఒక అమాయకమైన అమ్మాయి గా తాను ఇచ్చిన హావభావాలు ఎంతోమంది ప్రముఖ దర్శకులిని కూడా ఆకట్టుకున్నాయి.ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయి ని ప్రేమించాలి అనేంతగా హాసిని పాత్ర ప్రేక్షకులిలో చెరగని ముద్ర వేసుకుంది.తరువాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకొని దాదాపు సినిమాలకు స్వస్తి పలికారు జెనీలియా.జెనీలియా కధ అనే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ లో కూడా నటించడం విశేషం.

తాను చివరగా నటించిన చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ ముందు విఫలం అవ్వడంతో జెనీలియా కు అవకాశాలు కూడా పెద్దగా ఏమి రాలేదు.జెనీలియా సినిమాలకు దూరమై 8 యేళ్లు పైన అవుతుంది.మళ్ళీ ఇప్పుడు తిరిగి సినిమాలలోకి రానున్నారని చిత్ర వర్గాలలో ఓ టాక్ నడుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ,దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న లూసిఫెర్ రీమేక్ లో జెనీలియా ఒక కీలక పాత్ర పోషించనున్నారని ఇప్పటిదాకా అందుతున్న సమాచారం.ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి ఉంది .


End of Article

You may also like