Home Filmy Adda “నీ మొదటి జీతం ఎంత?”… అనే ప్రశ్నకి గెటప్ శ్రీను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

“నీ మొదటి జీతం ఎంత?”… అనే ప్రశ్నకి గెటప్ శ్రీను ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

by Mohana Priya

సినిమాలో ఫైట్స్, యాక్షన్, డైలాగ్స్, పాటలతో పాటు ముఖ్యమైన ఇంకొక ఎలిమెంట్ కామెడీ. అసలు కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కామెడీ చేయాలి అంటే కామెడీ ఆర్టిస్ట్స్ కూడా చాలా ముఖ్యం. అలా ఎంతో మంది ఆర్టిస్ట్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రెండు షోస్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

getup srinu about his first salary

ఈ షో ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఆర్టిస్ట్ శ్రీనివాస్ అలియాస్ గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్ తో పాటు ప్రతీ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మనల్ని అలరిస్తారు గెటప్ శ్రీను. గెటప్ శ్రీను సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.

getup srinu about his first salary

అయితే గెటప్ శ్రీను ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలోవర్స్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్ చేశారు. ఇందులో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు శ్రీను. అందులో ఒక నెటిజన్ “నీ ఫస్ట్ సాలరీ ఎంత అన్నా?” అని అడిగారు. అందుకు గెటప్ శ్రీను “ఉడుపులు ఊడుస్తున్నప్పుడు కట్టలు వేస్తే 40 రూపాయలు వచ్చేవి” అని సమాధానమిచ్చారు. శ్రీను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అనే విషయంపై చాలా సందర్భాల్లో చెప్పారు.

getup srinu about his first salary

ప్రస్తుతం శ్రీను టెలివిజన్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు శ్రీను. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో సోలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్  ఇటీవల విడుదల అయ్యింది. రాజు యాదవ్ సినిమాకి కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు ప్రశాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంకిత ఖారత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

getup srinu about his first salary

You may also like