Ads
కోడి రామకృష్ణ తర్వాత సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుచుకున్నారు ఎస్.వి.కృష్ణారెడ్డి. 90 సమయంలో పుట్టిన వాళ్లకి ఆయన సినిమాలు, పాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. అలా అని సోషియో ఫాంటసీ సినిమాలే కాకుండా మామూలు సినిమాలు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసేవారు.
Video Advertisement
కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా సినిమా నిర్మాణం, సంగీత దర్శకత్వం కూడా చేసేవారు. అలాగే కొన్ని సినిమాల్లో నటించారు కూడా. ఎస్ వి కృష్ణారెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మల్టీ టాలెంటెడ్ అన్న పదం ఆయనకి సరిగ్గా సరిపోతుంది.
ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఘటోత్కచుడు ఒకటి. ఆ సినిమాకి దర్శకత్వం తో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించారు కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు సినిమా తో ఎస్ వి కృష్ణారెడ్డి ఖాతాలో మరొక హిట్ పడడమే కాకుండా. ఆ సినిమాలో నటించిన కైకాల సత్యనారాయణ, అలీ, రోజా, తనికెళ్ల భరణి ఇలా ఎంతో మంది నటులకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఘటోత్కచుడు సినిమా లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక పాత్ర చిట్టి. బేబీ నికిత నటన ఆ పాత్రకి జీవం పోసింది. అంత చిన్న వయసులోనే ఎంతో బాగా నటించింది నిఖిత. తన నటన చూసిన చాలామంది నిఖిత భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత మరెక్కడా కనిపించలేదు నిఖిత.
అప్పుడే అంత బాగా నటించింది కాబట్టి ఇన్ని సంవత్సరాల సమయంలో తన నటన ఖచ్చితంగా ఇంకా మెరుగుపడే ఉంటుంది. ఒకవేళ నిఖిత సినిమాల్లోకి వస్తే మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎంతో మంది బాల నటులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. బహుశా నిఖిత కూడా భవిష్యత్తులో హీరోయిన్ గా అందరినీ పలకరిస్తుందేమో చూద్దాం.
End of Article