గత కొద్ది రోజుల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న ఒకే ఒక టాపిక్ సాయి ధరమ్ తేజ్ కి గాయాలు అవ్వడం. సాయి ధరమ్ తేజ్ కి గాయాలు అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒకటిగా ఆ రోడ్డు మీద దుమ్ము ఉండడం అని చెప్తున్నారు. ఈ విషయంపై చర్చ రోజు రోజుకి పెద్దదయింది.

సోషల్ మీడియాలో అసలు రోడ్లు అలా ఉంటే పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు అని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం రంగంలోకి దిగి సోమవారం నాడు రోడ్డు మీద కన్స్ట్రక్షన్ మెటీరియల్ పోసినందుకుగాను అరబిందో కన్స్ట్రక్షన్స్ కి లక్ష రూపాయల జరిమానా విధించింది.