Ads
జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి అని బాధపడకూడదు.మనకు వచ్చిన ఇబ్బందిని సరిఅయిన తెలివితేటలతో ఉపయోగించుకుంటే మన జీవితంలో రాబోయే కాలంలో అవి మనకి విజయాన్ని తెచ్చిపెడతాయి.ఇదే సూత్రాన్ని పాటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్ల మీదకు ఎవరూ రాకుండా కాలిగా ఉన్నాయి.ఈ పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ,కేటిఆర్ గారు చక్కగా ఉపయోగించుకున్నారు.
Video Advertisement
ఇది వరుకు పాడైపోయిన రోడ్లను తిరిగి నిర్మించడానికి కార్మికులు రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు కష్టపడేవాళ్ళు.మళ్ళీ రోడ్ల మీద జనసంచారం ఎక్కువ అవడంతో మళ్ళీ తిరిగి రోడ్లు పాడైపోయేయి.ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే కొనసాగి ఇబ్బందికి గురిఅయ్యేది.కాగా ఇప్పుడు కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ తో రోడ్లు అన్ని కలిగే ఉండడంతో రోడ్డులను బాగుచేయడానికి రోజుకి 18 గంటల నుండి 20 గంటలు సమయం దొరికింది.
దీనితో హైదరాబాద్ రోడ్లన్నీ చక్కగా తయారు అయ్యాయి.దీనితో కేటిఆర్ హర్షం వ్యకం చేస్తూ జిహెచ్ఎంసి అధికారాలను ప్రశంసిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.కేవలం 40 రోజులలోనే రోడ్లని ఇంత అందంగా తీర్చిదిద్దడం అభినందనీయం అని కేటిఆర్ అన్నారు.కాగా అరవింద కుమార్ ,మేయర్ బొంతు రామ్మోహన్ ,జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు ఇంజనీరింగ్ విభాగానికి కేటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Happy that @GHMConline has utilised the #Lockdown very productively for all pending road works
My compliments to the entire Engineering team and @arvindkumar_ias @bonthurammohan @CommissionrGHMC
Well done pic.twitter.com/yAw055cWIy
— KTR (@KTRTRS) May 24, 2020
End of Article