4 అడుగుల కీతో 10 అడుగుల తాళంతో పాటు.. అయోధ్య రామునికి వచ్చిన 9 బహుమతులు ఏంటో తెలుసా.?

4 అడుగుల కీతో 10 అడుగుల తాళంతో పాటు.. అయోధ్య రామునికి వచ్చిన 9 బహుమతులు ఏంటో తెలుసా.?

by kavitha

Ads

ఎన్నో దశాబ్దాల ఎదురుచూపుల తరువాత అయోధ్యలో రామాలయ మందిరం ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. జనవరి 22న బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా రామయ్యకు దేశవిదేశాల నుండి కానుకల వర్షం కురిసింది.కోట్లాది హిందువుల కల నెరవేరిన వేళ, రామయ్య పై తమకున్న భక్తిని రామ భక్తులు పలు రకాల కానుకలు సమర్పించడం ద్వారా చాటుకున్నారు. అలా రామయ్యకు వచ్చిన లక్షలాది కానుకలలో 9 ప్రత్యేక కానుకలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవిదేశాల నుండి రామ భక్తులు కానుకలను సమర్పించారు. నేపాల్ నుండి సుమారు 3,000 బహుమతుల షిప్‌మెంట్‌ అయోధ్యకు చేరుకుంది. వీటిలో నగదు, దుస్తులు, పండ్లు మరియు స్వీట్లు, అలాగే బంగారం మరియు వెండి వంటి విలువైన లోహాలతో సహా 3,000 కంటే ఎక్కువ విభిన్న కానుకలను సమర్పించారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూకు చెందిన కూరగాయల వ్యాపారి అనిల్​ సాహూ ఒక ప్రత్యేక గడియారాన్ని రూపొందించి, రామయ్యకు కానుకగా అందించాడు. 5 ఏళ్ళు కష్టపడి 9 దేశాలకు సంబంధించిన టైమ్ ను తెలిపేలా ఈ గడియారాన్ని రూపొందించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్​ను కూడా పొందాడు.

‘అష్టధాతు’ (8 లోహాల మిశ్రమం)తో 2,400 కిలోల బరువున్న గంటను ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్స్ జలేసర్‌లో తయారు చేసి, రామమమందిరానికి కానుకగా సమర్పించారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు తలుపును ఏర్పాటు చేశారు. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకుబంగారు పూతతో కలదు. సూరత్‌కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5,000 అమెరికన్ వజ్రాలతో రామాలయం నేపథ్యం పై ఒక నెక్లెస్‌ను రూపొందించారు. 2  కిలోల వెండితో నెక్లెస్‌ను రూపొందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన తాళాలు వేసే సత్య ప్రకాష్ శర్మ 10 అడుగుల ఎత్తు, 4.6 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో 400 కిలోల బరువున్న తాళాన్ని, 4 అడుగుల కీని రూపొందించి, కానుకగా అందిచారు.

రాముడు రావణుడిని చంపడానికి ఉపయోగించినట్లుగా చెప్పబడిన బాణం ప్రతిరూపాన్ని తయారు చేసి, అహ్మదాబాద్‌లోని జై భోలే గ్రూప్ రామయ్యకు సమర్పించారు. హైదరాబాద్ కు చెందిన ఒక భక్తుడు బంగారు పూతతో కూడిన పాదరక్షలను హైదరాబాద్ నుండి కాలినడకన అయోధ్యకు చేరుకుని సమర్పించాడు. వడోదరకు చెందిన  రైతు అరవింద్‌భాయ్ మంగళ్‌భాయ్ పటేల్  1,100 కిలోల ‘పంచధాతు’ (బంగారం, వెండి, రాగి, జింక్ మరియు ఇనుము) తయారు చేసిన భారీ దీపాన్ని కానుకగా సమర్పించారు. గుజరాత్‌లో తయారు చేసిన 108 అడుగుల పొడవు, 3,610 కిలోల బరువు, 3.5 అడుగుల వెడల్పు ఉన్న భారీ అగరబత్తిని రామయ్యకు కానుకగా సమర్పించారు.

Also Read: కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసినపుడు పాలు పొంగిస్తారు.. ఎందుకో తెలుసా..?

 

 


End of Article

You may also like