“పిల్లల చదువు ఆగిపోతుంటే… మహేష్ బాబు దగరికి వెళ్తే..?” అంటూ… సూపర్ స్టార్ “మహేష్ బాబు” పై… “జిన్నా” డైరెక్టర్ కామెంట్స్..!

“పిల్లల చదువు ఆగిపోతుంటే… మహేష్ బాబు దగరికి వెళ్తే..?” అంటూ… సూపర్ స్టార్ “మహేష్ బాబు” పై… “జిన్నా” డైరెక్టర్ కామెంట్స్..!

by Megha Varna

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. పైగా మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే హీరో కాదు బయట కూడా మహేష్ బాబు హీరోయే. మహేష్ బాబు గురించి జిన్నా దర్శకుడు కొన్ని విషయాలను చెప్పారు.

Video Advertisement

జిన్నా డైరెక్టర్ ఈషాన్ సూర్య మహేష్ బాబు తనకి చేసిన సహాయం గురించి చెప్పారు. శ్రీను వైట్ల దగ్గర ఈషాన్ సూర్య పని చేస్తున్నప్పుడు మహేష్ బాబు అతనికి పరిచయం అయ్యారట.

rajamouli-mahesh babu movie updates

అయితే ఆ టైం లో పిల్లలు చదువు కోసం ఇబ్బందుల్లో సూర్య ఉన్నారు. వాళ్ల చదువు కూడా ఆగిపోవాల్సి వచ్చేసిందట. అటువంటి టైం లో మహేష్ బాబుని సహాయం అడగడానికి సంకోచిస్తుంటే మహేష్ బాబు ఏమైంది అని అడిగారట ‘ఇందుకోసం ఇబ్బంది పడతావ్ ఏంటి’ అని మేనేజర్ ని పిలిచి ఏం కావాలో చూసుకోమని చెప్పారట. అయితే మహేష్ బాబు కనుక ఆ రోజు సహాయం చేయకపోతే ఈరోజు వారి పిల్లలు చదువు ఆగిపోయి ఉండేదని జిన్నా సినిమా డైరెక్టర్ ఈషాన్ సూర్య చెప్పారు.

మహేష్ బాబు మంచితనం గురించి మనకి తెలిసిందే. వెయ్యి మందికి పైగా చిన్నారులకి గుండె ఆపరేషన్ కోసం సహాయం అందించారు మహేష్ బాబు. అంతే కాక రెండు గ్రామాలని దత్తత తీసుకున్నారు. అక్కడ విద్యా వైద్యం వండి సదుపాయాలని కూడా సమకూరుస్తున్నారు. మహేష్ బాబు టెక్నీషియన్లు కి చిన్న చిన్న ఆర్టిస్టులకి కూడా సహాయం అందిస్తూ ఉంటారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


End of Article

You may also like