“రాధే శ్యామ్” వాలంటైన్స్ డే వీడియోలో… ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది..!

“రాధే శ్యామ్” వాలంటైన్స్ డే వీడియోలో… ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది..!

by Mohana Priya

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.

girl in radhe shyam valentine glimpse video

కొంత మంది సినిమా పునర్జన్మ నేపథ్యంలో సాగుతుంది అంటూ ఉంటే, కొంత మంది మాత్రం అలా ఏమీ లేదు అని అంటున్నారు. మరి అసలు రాధే శ్యామ్ కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.

girl in radhe shyam valentine glimpse video

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ప్రభాస్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కనిపిస్తారు. ఆ అమ్మాయిని మనం అంతకు ముందు చాలా సార్లు చూశాం. తను ఎవరో కాదు సాషా ఛెత్రీ. సాషా అంతకుముందు ఎయిర్‌టెల్ ప్రకటనలలో కనిపించారు. అలా చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం సాషా రాధే శ్యామ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించారు.


End of Article

You may also like