పూజకి జీన్స్ వేసుకోడమే ఆ 17ఏళ్ల అమ్మాయి పాపమా.? ఇందులో తప్పు ఎవరిది.?

పూజకి జీన్స్ వేసుకోడమే ఆ 17ఏళ్ల అమ్మాయి పాపమా.? ఇందులో తప్పు ఎవరిది.?

by Mohana Priya

Ads

జీన్స్ వేసుకొని పూజలో పాల్గొంది అనే కారణంతో ఒక ఒక అమ్మాయిని కొట్టి చంపేసిన ఘటన ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే బీబీసీ తెలుగు కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ కి చెందిన 17 సంవత్సరాల నేహా పాస్వాన్ జీన్స్ లో పూజ లో పాల్గొంది. తన కుటుంబ సభ్యులు, తన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Video Advertisement

Girl was attacked by her family members for wearing jeans

కానీ నేహ “జీన్స్ తయారుచేసింది వేసుకోవడానికే కదా. నేను కచ్చితంగా అవే వేసుకుంటాను” అని చెప్పింది. దాంతో గొడవ పెద్దదయ్యి చివరికి హింసకు దారి తీసింది. నేహా కుటుంబం దేవరియాలోని సవ్రేజీ ఖార్గ్ కి చెందినవారు. ఈ విషయంపై నేహ తల్లి శకుంతల మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయిన నేహా ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నట్టు తన ఇంట్లో వాళ్ళు తనకు చెప్పారు అని చెప్పారు.

Girl was attacked by her family members for wearing jeans

శకుంతల మాట్లాడుతూ “నన్ను వాళ్ళతో హాస్పిటల్ కి తీసుకెళ్లలేదు. నేను మా బంధువులకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. వాళ్ళు జిల్లా ఆస్పత్రికి వెళ్లి చూశారు. కానీ ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. మరుసటి రోజు ఉదయం గండక్​ నదిపై ఉన్న ఒక బ్రిడ్జ్ కి ఒక అమ్మాయి మృతదేహం వేలాడుతోంది అని సమాచారం వచ్చింది. దాంతో వాళ్ళు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని నేహాది అని గుర్తించారు” అని అన్నారు.

Girl was attacked by her family members for wearing jeans

హత్యతో పాటు సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేయడంపై పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో నేహా నానమ్మ, తాతయ్య, బాబాయిలు, చిన్నమ్మలు, సోదరులు, ఆటో డ్రైవర్ ఉన్నారు. నేహా నానమ్మ, తాతయ్య, బాబాయ్, ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Girl was attacked by her family members for wearing jeans

నేహా తండ్రి అమర్​నాథ్ పంజాబ్ లోని లూధియానాలో నిర్మాణ పనుల్లో కూలీగా పని చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమర్​నాథ్ ఇంటికి తిరిగి వచ్చారు. నేహా తల్లి మాట్లాడుతూ నేహా పై తన కుటుంబ సభ్యులు చదువుకోవద్దు అని ఒత్తిడి తెచ్చారు అని, నేహాకి మోడరన్ దుస్తులు వేసుకోవడం ఇష్టం అని చెప్పారు. నేహా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంది అని కూడా చెప్పారు.

source from : BBC Telugu


End of Article

You may also like