Ads
అయోధ్య రామ మందిరం, మసీదు గొడవ ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు ఆ స్థానంలో రామ మందిరం స్థాపించబడింది. అయితే, ఇప్పుడు జ్ఞానవాపి మసీదుకు ప్రాంతంలో కూడా అక్కడ ఉన్న హిందువులు పూజ చేసుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది.
Video Advertisement
ఇది దాదాపు 37 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. దాదాపు 1990 అక్టోబర్ సమయంలో ములాయం సింగ్ యాదవ్ సీఎం గా ఉన్నారు.
అప్పుడు రామ మందిరం నిర్మాణం చేయాలి అని విశ్వహిందూ పరిషత్ వారు కరసేవ నిర్వహించారు. అప్పుడు అందుకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలి అని ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం దాదాపు 28 వేల మంది పోలీసుల సిబ్బందిని మోహరించారు. అయినా కూడా కరసేవకులు బారీకేడ్లని దాటుకొని మరి మసీదు దగ్గరికి వెళ్లారు. మసీదు మీద కాషాయపు రంగు జెండాలని ఎగరవేశారు. అప్పుడు జరిగిన సంఘటనలో కాల్పులు జరిగాయి. అందులో 20 మంది మరణించారు.
కానీ ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఇంకా ఎక్కువ మంది మరణించారు అని చెప్పారు. 1991 లో ఈ ఘటన తర్వాత యూపీలో ఎన్నికలు జరిగాయి. అక్కడ బిజెపి పార్టీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. 1992లో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేసిన సంఘటన జరిగింది. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఆ సమయంలో కేంద్రంలో ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత సంవత్సరం ఎన్నికలు జరిగాయి. అందులో మళ్లీ ములాయం సింగ్ యాదవ్ అధికారంలోకి వచ్చారు.
అప్పుడు జ్ఞానవాపి సెల్లార్ లో హిందువులు పూజలు చేయకూడదు అంటూ ములాయం యాదవ్ ప్రభుత్వం ఆదేశించింది. హిందువుల పూజల మీద అక్కడ నిషేధం విధించింది. 1993 వరకు అక్కడ పూజలు జరిగాయి. అక్కడ వ్యాస్ అనే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు 200 ఏళ్ళకి పైగా పూజలు చేశారు. అందుకే వారి పేరు మీద ఆ సెల్లార్ కి వ్యాస్ జీ కా తెహ్ ఖానా అని పేరు కూడా వచ్చింది. కానీ ములాయం సింగ్ ప్రభుత్వం వచ్చాక పూజలు నిలిపివేసింది. ఇందుకు లా అండ్ ఆర్డర్ సమస్యని కారణంగా చూపింది.
అయితే మరొక పక్క శైలేంద్ర వ్యాస్ ఎలాంటి న్యాయ ఉత్తర్వులు జారీ చేయకుండానే ఉక్కు కంచెను నిర్మించారు అని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో హిందూ దేవాలయం ఒకటి ఉన్నట్లు, ఈ విషయాన్ని ఏఎస్ఐ సర్వే తెలిపింది అని హిందువుల తరపు న్యాయవాది అయిన విష్ణశంకర్ జైన్ చెప్పారు. ఇది 800 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి. ఈ కాలక్రమంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. విధ్వంసాలు జరిగి, ఆ తర్వాత పునర్నిర్మాణాలు కూడా జరిగాయి.
మహారాజా జయచంద్ర, ఆయన పట్టాభిషేకం తర్వాత, దాదాపు 1170 నుండి 89 మధ్యలో ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు అని దక్షిణాసియా అధ్యయనయాలలో ఎంతో నైపుణ్యం కలిగిన పండితుడు అయిన యుగేశ్వర్ కౌశల్ తెలిపారు. అయితే 1669 లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైనే జ్ఞానవాపి మసీదుని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు నిర్మించారు అని ఇప్పటికీ ఒక కథనం అయితే ఉంది. దీన్ని అక్కడ చాలా మంది విశ్వసిస్తారు. అలా ఈ జ్ఞానవాపి మసీదు గొడవలో ములాయం సింగ్ పాత్ర కూడా ఉంది.
ALSO READ : సమ్మక్క సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగురవేస్తారో తెలుసా..? దీనికి కారణం ఏంటంటే..?
End of Article