Home Filmy Adda చిరంజీవి “గాడ్ ఫాదర్” ఫస్ట్ రివ్యూ..! ఇలా అనేశారేంటి..?

చిరంజీవి “గాడ్ ఫాదర్” ఫస్ట్ రివ్యూ..! ఇలా అనేశారేంటి..?

by Mohana Priya

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇది మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. గాడ్ ఫాదర్ ట్రైలర్ లో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీ నటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్య దేవ్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా ట్రైలర్ లో కనిపించారు. గాడ్ ఫాదర్ సినిమా తో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. అయితే ఇది మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.

god father movie first review by umair sandhu
ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ చెప్పారు. సోషల్ మీడియాలో ఉమైర్ సంధు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. “గాడ్ ఫాదర్ ఒక యావరేజ్ సినిమా. బి,సి క్లాస్ మాస్ సినిమా వారికి కూడా ఇలాగే అనిపిస్తుంది. పాత స్టొరీని కొత్తగా చెప్పినట్టు ఉంది. చిరంజీవి మీకు కొంచెం విశ్రాంతి కావాలి” అని ఈ సినిమా గురించి రాశారు.

god father movie first review by umair sandhu

అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “చిరంజీవికి సాలిడ్ స్క్రిప్ట్ కావాలి. ఈ ప్రజల హీరో, మాస్ రోల్స్ నుండి చిరంజీవిని ఎవరైనా బయటికి తీసుకురండి. ఇలాంటి పిచ్చి పిచ్చి స్క్రిప్ట్ లతో మీ టాలెంట్ వేస్ట్ చేసుకోకండి. మీరు మెగాస్టార్. కానీ స్క్రిప్ట్ ఛాయిస్ మాత్రం అసలు ఆలోచించట్లేదు. గాడ్ ఫాదర్ ఒక యావరేజ్ సినిమా” అని రాశారు. అయితే, అంతకుముందు కూడా ఉమైర్ సంధు చాలా సినిమాలకి రివ్యూ ఇచ్చారు. ఆచార్య సినిమా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ప్రేక్షకుల స్పందన వేరే లాగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది? ఈ రివ్యూలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.

You may also like