అయోధ్య రామునికి బంగారు చీర.. బాల రామునికి కానుకగా సిరిసిల్ల చేనేత కార్మికుడి కానుక!

అయోధ్య రామునికి బంగారు చీర.. బాల రామునికి కానుకగా సిరిసిల్ల చేనేత కార్మికుడి కానుక!

by Mounika Singaluri

Ads

అయోధ్య శ్రీరామచంద్రునికి సిరిసిల్ల నుంచి బంగారు చెరువు కానుకగా పంపించనున్నారు సిరిసిల్లకు చెందిన హరి ప్రసాద్ స్వయంగా చేసిన బంగారు చీరను ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచబోతున్నారు ఈ క్రమంలో నేతన్న హరిప్రసాద్ నివాసానికి ఇన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎం.పి బండి సంజయ్ వెళ్లి బంగారు చీరను పరిశీలించారు.

Video Advertisement

చీరను పరిశీలించిన బండి సంజయ్ మాట్లాడుతూ సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరలు తయారు చేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉంది ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చీరను ఎనిమిది గ్రాముల బంగారం 20 గ్రాముల వెండితో రూపొందించారు.

sari for ayodhya ram mandir temple

రామాయణ ఇతివృత్తం తెలియజేసే చిత్రాలతో ఈ చీరను చేనేత కళాకారుడు హరిప్రసాద్ ఆయన సతీమణి రేఖతో కలిసి చేనేత మగ్గంపై 20 రోజులపాటు శ్రమించి నేశారు. దీని ప్రత్యేకత ఈ చీర అంచులో అయోధ్య రామ మందిరం, శ్రీ రామ పట్టాభిషేకం, జై శ్రీరామ్, శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చే విధంగా మరోవైపు బార్డర్ కు జైశ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీరకొంగులో సీతారాముల ప్రతిబింబం, చీరలో రామాయణంలోని ఇతర ఘట్టాలు నేయడం జరిగింది.

తెలంగాణలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్డి హరి ప్రసాద్ చేనేత కళాకారుడు అనునిత్యం నేత వృత్తిలో ఎన్నో అద్భుతాలు చేసి సిరిసిల్ల పేరు ప్రఖ్యాతలు దేశమంతా చర్చించేలాగా ప్రయోగాలు చేశాడు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేళ మరొకసారి తన కళా దృష్టికి పని చెప్పారు. సీతమ్మ వారి కోసం బంగారు చీరను రెడీ చేసి ప్రధాని చేతుల మీదుగా అందిస్తానని చెప్తున్నారు.


End of Article

You may also like