ఆటోమేటిక్ పానీపూరి మెషీన్…మనోళ్ళకి ఆ 4 ఆప్షన్ లు కూడా కావాలనుకుంట.?

ఆటోమేటిక్ పానీపూరి మెషీన్…మనోళ్ళకి ఆ 4 ఆప్షన్ లు కూడా కావాలనుకుంట.?

by Mohana Priya

Ads

లాక్ డౌన్ లో జనాలు ఎక్కువగా మిస్సయిన ఫుడ్ పానీ పూరి. పేరు తలుచుకుంటేనే మనలో సగం మందికి నోరూరుతుంది. కొంతమంది యూట్యూబ్ పుణ్యమా అని ఇంట్లో ట్రై చేశారు. కానీ ఏదేమైనా ఆ బండి దగ్గర నుంచొని పానీపూరి అతను మన చేతిలో ఉన్న ప్లేట్ లో ఒక్కొక్క పానీ పూరి పెడుతూ ఉంటే మనం దాంట్లో అదే ప్లేట్ లో ఉన్న ఉల్లిపాయలు ఆ పానీ పూరి లో వేసుకొని తింటూ ఉంటే అబ్బా! అదొక ఎమోషన్.

Video Advertisement

అలాంటి పానీపూరి బండి ని గత నాలుగు నెలలుగా ఎక్కడా పెట్టు పెట్టనివ్వలేదు. ఇప్పుడు జొమాటో,  స్విగ్గి ఓపెన్ అయినా కానీ అందులో పానీపూరి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దేశ ప్రజలందరూ కరువు లో ఉన్నారు. అవును పానీ పూరి కరువు లో ఉన్నారు.ఒకవేళ కొన్నాళ్ల తర్వాత పరిస్థితి అంతా మామూలుగా అయ్యి పానీపూరి బండి పెట్టడానికి అనుమతి ఇస్తే ప్రతి పానీపూరి బండి పెట్టుకునేవాడు దేశంలో ఉన్న అత్యధిక సంపన్నుల లిస్టులో కచ్చితంగా ఉంటారు. మీరు సినిమాల్లో చూసే ఉంటారు కొడుకు తప్పిపోయి 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల్ని కలిస్తే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పానీపూరి బండి ని చూస్తే మన రియాక్షన్ కూడా దాదాపు అలానే ఉంటుంది. ఆనందభాష్పాలు అన్నమాట.

ఇలా పానీపూరి ఆకలితో అలమటించి పోతున్న ప్రజలని ఆదుకోవడానికి ఒక ఆపద్బాంధవుడు పానీపూరి మెషిన్ ని కనిపెట్టాడు. అవును ఇది కల కాదు మీరు విన్నది నిజమే. పానీపూరి మిషన్ వచ్చింది. గుజరాత్ కి చెందిన వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. పానీపూరి మెషిన్ డెమో చేస్తూ ఆ వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది.చూడటానికి కొంచెం ఏటీఎం మెషిన్ లాగానే ఉంటుంది. మనకి ఎన్ని రూపాయల పానీపూరి కావాలో ముందు ఆ నంబర్ ప్రెస్ చేయాలి. తర్వాత ఏటీఎం కార్డు పెట్టినట్టే ముందు ప్రెస్ చేసిన అన్ని రూపాయల నోటు పెట్టాలి. క్యాష్ వచ్చే కౌంటర్ లాగా ఉన్న డబ్బా లో ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ మీద పానీ పూరి పట్టే షేప్ లో రంధ్రాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్క పానీపూరి బయటికి వస్తుంది. ఆ బెల్ట్ కదులుతూ ఉంటుంది కాబట్టి పానీపూరి బయటికి వచ్చిన వెంటనే మనం దాన్ని తీసేసుకోవాలి.

ఇదే ఆ మెషిన్. బాగుంది కదా? కానీ కొన్ని సదుపాయాలు లేకపోవడం వల్ల కాస్త అసంతృప్తిగా ఉంది.

#1 ఓకే గూగుల్ అని ఏదైనా ప్రశ్న అడగంగానే గూగుల్ ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. అదేవిధంగా ఆ మెషిన్ ముందు నించొని “భయ్యా థోడా ప్యాజ్ డాలో” అనంగానే ఉల్లిపాయలు పడడం,

#2 ఇంకా “భయ్యా థోడా పాని డాలో” అనగానే పానీపూరి నీళ్లు రావడం

#3 అదే కాకుండా స్పెషల్ పానీపూరి  రావడం

#4 అదే కాకుండా మీఠా పూరి కూడా వస్తే ఇంకా బాగుంటుంది.

సరే ఎలాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ మిషన్ రాలేదు కాబట్టి పైన చెప్పినవి అన్నీ ఆడ్ చేసి అప్డేటెడ్ పానీపూరి మిషన్ విడుదల చేయమని అడుగుదాం. ఈ విషయాన్ని సోషల్ మీడియా అనే ఆయుధం ద్వారా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వరకు తీసుకెళ్దాం.

కానీ ఏదేమైనా ఇలా ఫుడ్ ని తయారుచేసే మిషిన్ కనిపెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆ మెషిన్ వేరే రాష్ట్రాల్లో కూడా విడుదల చేస్తే పానీ పూరి మళ్లీ అందుబాటులోకి వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నో నెలలు కష్టపడి ఈ మెషిన్ తయారు చేసిన ఆ వ్యక్తికి తన ఆవిష్కరణ ను అందరికీ చూపించడానికి ఒక వేదిక దొరుకుతుంది.మనం పడే కష్టానికి తగిన గుర్తింపు లభించాలి అనే ఆకలి ముందు పానీ పూరి ఆకలి చిన్నదే. ఈ మెషిన్ గనుక వెలుగులోకి వస్తే ఆ వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది.


End of Article

You may also like