టిక్ టాక్ యూజర్స్ కి “గుడ్ న్యూస్”…మీ టాలెంట్ వేస్ట్ అయిపోయిందనుకొని బాధపడకండి!

టిక్ టాక్ యూజర్స్ కి “గుడ్ న్యూస్”…మీ టాలెంట్ వేస్ట్ అయిపోయిందనుకొని బాధపడకండి!

by Mohana Priya

Ads

టిక్ టాక్ బ్యాన్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. టిక్ టాక్ బ్యాన్ అవ్వబోతుంది అన్న విషయం తెలిసిన తర్వాత టిక్ టాక్ స్టార్లు యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ లేదా వేరే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ద్వారా తమ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తామని ప్రమాణం చేశారు.

Video Advertisement

మాట ఇచ్చినట్టుగానే మళ్లీ టిక్ టాక్ తారలు అందరూ తమ ఫ్యాన్స్ ని తిరిగి సోషల్ మీడియాలో పలకరించబోతున్నారు. టిక్ టాక్ స్టార్లకు ఇంస్టాగ్రామ్ ఈ అవకాశాన్ని కల్పించింది.

ఇన్స్టా రీల్స్ (Instareels) అనే ఒక ఆప్షన్ ను ఇంస్టాగ్రామ్ విడుదల చేయనుంది. అందులో 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలు చేయవచ్చట. ఈ ఆప్షన్ ఇంతకుముందే ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ లో విడుదల చేశారు. ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

ఇవాళ రాత్రి 7:30 కు ఇన్స్టా రీల్స్ భారతదేశంలో విడుదల చేయనున్నారు. మొదట యూట్యూబర్ జాహ్నవి దాశెట్టి, హిందీలో ఫిల్టర్ కాపీ లో నటించే రాధిక బంగియా, ఇంద్రాణి బిశ్వాస్, పంజాబీ గాయకుడు అమ్మీ విర్క్, ఇంకా పలువురు సెలబ్రిటీల వీడియోలను  ఇన్స్టా రీల్స్ లో విడుదల చేస్తారు.

బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ లో ఇన్స్టా రీల్స్ విడుదలయింది కాబట్టి దాన్ని వాడిన వాళ్ళు ఇన్స్టా టీవీ లాగా ఇందులో కూడా ఎక్కువ వీడియోలు పెట్టే సదుపాయాన్ని కల్పించమని కోరారు. దీంతో భారతదేశంలో ఇన్స్టా రీల్స్ యొక్క యూజర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే తమ వీడియోలన్నీ కనిపించేలా మార్పులు చేసి విడుదల చేశారు.ఇందులో కూడా టిక్ టాక్ లాగా ఆడియో కి యాక్షన్ చేసే ఆప్షన్ ఏర్పాటు చేశారు.

ఫేస్బుక్ ప్రోడక్ట్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ షా మాట్లాడుతూ ” ఇన్స్టా రీల్స్ లో ముందు ముందు ఇంకా కొత్త ఫీచర్ల ను యాడ్ చేస్తాం. భాగస్వామ్యం కోసం కొంతమంది ప్రముఖ క్రికెటర్ లతో కలిసి పని చేస్తున్నాం” అని చెప్పారు.ఇంక ఇప్పటినుండి టిక్ టాక్ లోని కంటెంట్ ను మళ్లీ తిరిగి చూడొచ్చు.


End of Article

You may also like