BHIMAA REVIEW : “గోపీచంద్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

BHIMAA REVIEW : “గోపీచంద్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mounika Singaluri

Ads

అటు కమర్షియల్ సినిమాలు, ఇటు ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేసి, మ్యాచో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. ఇప్పుడు గోపీచంద్ భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : భీమా
  • నటీనటులు : గోపీచంద్, ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ.
  • నిర్మాత : కెకె రాధామోహన్
  • దర్శకత్వం : ఎ హర్ష
  • సంగీతం : రవి బస్రూర్
  • విడుదల తేదీ : మార్చి 8, 2024

bhimaa movie review

స్టోరీ :

మహేంద్రగిరి అనే ఊరిలో భవాని (ముఖేష్ తివారి) ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని మాటని ఆ ఊరు పాటించాల్సిందే. ఆయనకు ఎదురు తిరిగిన వారిని వదిలిపెట్టడు. అలా ఒక ఎస్సై (కమల్ కామరాజు) ని చంపేస్తాడు. దాంతో ఆ తర్వాత భీమా గోపీచంద్ ఆ ప్రాంతానికి ఎస్సైగా వస్తాడు. భవాని తన టాంకర్ల దగ్గరికి వచ్చిన వారిని ఊరుకోడు. కానీ భీమా భవాని టాంకర్ల జోలికి వస్తాడు. అసలు ఆ టాంకర్లలో ఏం ఉంది? విద్య (మాళవిక శర్మ) ఎవరు? భవాని టాంకర్ల జోలికి వెళ్ళాక భీమా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా శివాలయం మూతపడడానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

bhimaa movie review

రివ్యూ :

గోపీచంద్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. అప్పుడు గోలీమార్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించారు. గోపీచంద్ కి పోలీస్ పాత్ర చాలా బాగా సూట్ అయ్యింది. అలాగే మరొక పాత్రలో కూడా గోపీచంద్ కనిపించారు. రామా అనే పాత్రలో కూడా గోపీచంద్ చాలా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించారు. సినిమా కథ మనకి తెలిసిన కథ. కానీ గోపీచంద్ తనదైన స్టైల్ లో ఈ సినిమాలో నటించారు. పరశురామ క్షేత్రం గురించి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది.

bhimaa movie review

కానీ హీరో ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో, ఆ తర్వాత నుండి సినిమా ఒక కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళ్లిపోతుంది. కమర్షియల్ సినిమాలు చూసిన వాళ్ళకి తర్వాత ఏమవుతుంది అనేది అర్థం అవుతుంది. ఇంక ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, గోపీచంద్ సినిమాకి ప్రధాన బలం. రెండు పాత్రల్లో చాలా బాగా నటించారు. భవాని పాత్రలో ముఖేష్ తివారి కూడా బాగా నటించారు. రవీంద్ర వర్మ అనే ఒక ప్రకృతి వైద్యుడు పాత్రలో నాజర్ నటించారు. పారిజాతం అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ నటించారు. వీరందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. హీరోకి ఉన్న రెండు లవ్ స్టోరీస్ కూడా సరిగ్గా రాసుకోలేదు.

bhimaa movie review

ముఖ్యంగా మానవిక శర్మతో వచ్చే లవ్ ట్రాక్ అయితే సింక్ లేనట్టు అనిపిస్తుంది. జోక్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అది కూడా ముఖ్యంగా క్లైమాక్స్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. స్వామీ జె గౌడ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా స్టార్టింగ్ అంతా కూడా ఆసక్తికరంగా సాగిన సినిమా, ఒక 15-20 నిమిషాల తర్వాత కమర్షియల్ సినిమా జోన్ లోకి వెళ్ళిపోతుంది, మళ్లీ క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నారు. కానీ మధ్యలో ఉండే సీన్స్ మాత్రం కొంత వరకు రొటీన్ గా అనిపిస్తాయి. స్టార్టింగ్, క్లైమాక్స్ రాసుకున్నట్టు మధ్యలో ఉన్న సీన్స్ కూడా రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • గోపీచంద్
  • స్టార్టింగ్ లో చూపించిన పరశురామ క్షేత్రం పాయింట్
  • నిర్మాణ విలువలు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • లవ్ ట్రాక్స్
  • నవ్వు తెప్పించని కామెడీ సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

సినిమా మొత్తం తెలిసిన కథ అని అనలేం. అలా అని సినిమా మొత్తం కొత్తగా ఉంది అని కూడా చెప్పలేం. కానీ గోపీచంద్ మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించారు. గోపీచంద్ కోసం, కాస్త కొత్తగా ఉన్న కథనం కోసం సినిమా చూద్దాం అని అనుకునే వారికి భీమా సినిమా ఒక్కసారి చూడగలిగే కమర్షియల్ యాక్షన్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like