Ads
- చిత్రం : రామబాణం
- నటీనటులు : గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు.
- నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- దర్శకత్వం : శ్రీవాస్
- సంగీతం : మిక్కీ జే మేయర్
- విడుదల తేదీ : మే 5, 2023
Video Advertisement
స్టోరీ :
విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అందుకు కారణం తన అన్న (జగపతి బాబు) తో ఉన్న గొడవలు. ఈస్ట్ గోదావరి లో ఉన్న రాఘవేంద్రపురంలో తన అన్న హోటల్ నడుపుతూ ఉంటాడు. తర్వాత విక్కీ కోల్‌కతా లో పెద్ద డాన్ అవుతాడు. తర్వాత విక్కీ, భైరవి (డింపుల్ హయాతి) అనే యూట్యూబర్ ని ప్రేమిస్తాడు.
కొన్ని కారణాల వల్ల విక్కీ మళ్లీ తన ఇంటికి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత తన అన్న సమస్యల్లో ఉన్నాడు అని విక్కీ తెలుసుకుంటాడు. ఆ సమస్యల నుండి విక్కీ ఎలా బయటపడేసాడు? అన్నదమ్ములు మళ్లీ కలిసారా? అసలు వాళ్ళకి ఉన్న సమస్య ఏంటి? విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డిఫరెంట్ పాత్రలు చేస్తూ, తనని తాను ప్రతి సినిమాకి నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు గోపీచంద్. గత సంవత్సరం పక్కా కమర్షియల్ వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో ఒక కామెడీ పాత్ర పోషించిన గోపీచంద్, ఇప్పుడు ఈ సినిమాలో కూడా మరొక ఎంటర్టైనింగ్ పాటతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
సినిమా మొత్తం కూడా ఒక ఫ్యామిలీ డ్రామాగా సాగుతుంది. సినిమా కథ పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. కానీ సినిమా తీసిన విధానం ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
మిక్కి జే మేయర్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. కానీ సినిమాలో కొత్తదనం లోపించడం వల్ల సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి ఉండదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం తెరపై చాలా బాగా వచ్చాయి.
ప్లస్ పాయింట్స్ :
- అక్కడక్కడ వర్కౌట్ అయిన కామెడీ
- ఎమోషన్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి కథ విషయంలో పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా చూద్దాం అనుకునే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన ఎమోషనల్ సినిమాల్లో ఒక మంచి సినిమాగా రామబాణం సినిమా నిలుస్తుంది.
watch trailer :
End of Article