PLI స్కీమ్ లో 22 కంపెనీలతో ఒప్పందం… 12 లక్షల మందికి ఉపాధి అవకాశం

PLI స్కీమ్ లో 22 కంపెనీలతో ఒప్పందం… 12 లక్షల మందికి ఉపాధి అవకాశం

by Mohana Priya

కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై ఒక్క వేల కోట్ల విలువైన ఉడాన్ సెసోహన్ యోజన (పిఎల్‌ఐ) ప్రారంభించింది. “ఈ పథకం కింద 22 డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీలు ప్రభుత్వంతో కలిశాయి. ఈ కంపెనీలతో కలిసి వచ్చే ఐదు సంవత్సరాల్లో 11 వేల కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాం” అని భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించారు.

Video Advertisement

రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ” ఈ పథకం కింద దేశంలో సుమారు 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందులో 11 లక్షల కోట్ల విలువైన మొబైల్స్ తయారుచేయడానికి, ఏడు లక్షల కోట్ల మొబైల్స్ ఎగుమతి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

దీంతో 22 కంపెనీలు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాళ్లందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో తైవాన్, దక్షిణకొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలు శాంసంగ్, రైజింగ్ స్టార్, పెగాటన్, విన్ కంపెనీలు ఉన్నాయి.

ఈ అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలు 15 వేల రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే మొబైల్ ఫోన్ల ను తయారు చేయాలి అనే షరతు పెట్టాయి. భారతదేశం మొబైల్ తయారీ సంస్థల మీద అలాంటి షరతులు ఏమీ లేవు. ప్రపంచ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో ఆపిల్ సంస్థ కి 37 శాతం శాంసంగ్ కి 22 శాతం వాటాలున్నాయి.

ఈ పథకంలో చైనాకు చెందిన ఏ ఒక్క కంపెనీ కూడా లేదు. కానీ ఏ ఒక్క దేశానికి చెందిన పెట్టుబడి అయినా భారత్ వ్యతిరేకించదు. కానీ ఒకవేళ ఆ ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి పొందాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి. ఈ పథకంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది” అని అన్నారు.

 


You may also like