Ads
రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరగడమే కానీ తగ్గే సూచనలు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కువగా ప్రయాణించేవారికి పెట్రోల్ అవసరం కాబట్టి ధరలు పెరిగిన కూడా ఏమీ అనలేక పోతున్నారు. పెట్రోల్ కూడా నిత్యావసరాలు ఒక భాగం అయిపోయింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో నీటితో నడిచే ఒక ద్విచక్ర వాహనాన్ని తయారు చేశాడు ఒక విద్యార్థి. వివరాల్లోకి వెళితే.
Video Advertisement
దేవేంద్రన్ తమిళనాడులోని వెల్లూరు లో ఒక ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. దేవేంద్రన్ నీళ్ళతో నడిచే ఒక మోటార్ సైకిల్ కనుగొన్నాడు. తర్వాత ఆ మోటార్ సైకిల్ ని ప్రయోగిస్తే నిజంగానే అది నీటితో నడిచింది. దాంతో దేవేంద్రన్ ని ఎంతో మంది అభినందించారు.
దేవేంద్రన్ ఆవిష్కరణ విజయవంతమవడంతో వెల్లూరు లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో మోటార్ సైకిల్ ని ప్రదర్శించారు. ఇస్రో మాజీ చైర్మన్ మైలా సామి అన్నాదురై దేవేంద్రన్ తయారు చేసిన మోటార్ సైకిల్ ని పరిశీలించారు. ప్రయోగం నచ్చడంతో నీళ్ళతో నడిచే మోటార్ సైకిల్ ని సాంకేతికంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
అంతేకాకుండా ఆ జిల్లా కలెక్టర్ దేవేంద్రన్ ని అభినందించి 25 వేల నగదు బహుమతి ఇచ్చారు. నిజంగా ఈ మోటార్ సైకిల్ గనుక అందరికీ అందుబాటులోకి వస్తే పెట్రోల్ ఖర్చులు మిగలడమే కాకుండా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఒక మోటార్ సైకిల్ మాత్రమే కాకుండా మిగిలిన వాహనాలు కనీసం అన్నీ కాకపోయినా కొన్ని వాహనాలయినా కూడా నీళ్ళతో నడిచేలా సాంకేతికంగా అభివృద్ధి చేయాలి అని ఆశిద్దాం.
End of Article