Ads
ప్రస్తుతం కాలంలో వినోదం అంటే సినిమాలు, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్‌లు అంటూ డిజిటల్ స్క్రీన్స్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు వినోదం అంటే ఏడాదికో రెండేళ్లకో ఒకసారి ఊళ్ళో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్స్, సర్కస్ లే. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్స్ లో, డిజిటల్ స్క్రీన్స్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో వెళ్తే సర్కస్ లేదా ఎగ్జిబిషన్స్ కూడా మంచి వినోదాన్ని పంచుతాయి.
Video Advertisement
చిన్న పిలల్ల దగ్గర నుండి వృద్దుల వరకు ఇలాంటి వాటిపై అందరికి ఆసక్తి కలుగుతుంది. ఇక ఆసియాలో అతి పెద్ద షో బాంబే సర్కస్ ను ఎవరికైనా చూడాలనిపిస్తుంది. ఈ సర్కస్ సుమారు 30 ఏళ్ళ తరువాత హైదరాబాద్ కి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
104 సంవత్సరాల చరిత్ర కలిగిన ‘గ్రేట్ బాంబే సర్కస్’ ఇప్పటివరకు ఇండియాలో చాలా నగరాల్లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శనలు ఇచ్చింది. దాదాపు ముప్పై ఏళ్ళ తరువాత హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద సర్కస్‌గా పాపులర్ అయిన గ్రేట్ బాంబే సర్కస్ కుత్బుల్లాపూర్ లోని హెచ్‌ఎంటీ గ్రౌండ్స్ కి వచ్చింది. ఇక్కడికి బస్ లో వెళ్లాలంటే సికింద్రాబాద్ నుండి ’24J’ బస్‌లో వెళ్లవచ్చు. సొంత వెహికిల్స్ లో వెళ్లేవారికి అయితే సికింద్రాబాద్ నుండి ముప్పై నిమిషాలు పడుతుంది. ఈ సర్కస్‌లో నిత్యం మధ్యాహ్నం 1, సాయంత్రం 4 మరియు 7 గంటలకు ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి.
టికెట్లు ఆన్‌లైన్ మరియు మ్యానువల్‌గా కూడా తీసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో ఈ సర్కస్ టికెట్ కావాలనుకునేవారు,గ్రేట్ బాంబే సర్కస్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లో తీసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. టిక్కెట్ల ధరలు 100, 200, 300, 400 రూపాయాల వరకు ఉన్నాయి. వీకెండ్స్ లో ఫ్యామిలీ, పిల్లలతో, ఫ్రెండ్స్ తో మంచి సమయం గడపాలంటే ‘గ్రేట్ బాంబే సర్కస్’ బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.
కాగా, గ్రేట్ బాంబే సర్కస్‌లో స్కైవాక్, అరవై అడుగుల ఎగిరే ట్రాపెజ్ కళాకారులు, అమెరికన్ ట్రాంపోలిన్, రష్యన్ రింగ్ డ్యాన్స్, అరేబియన్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్ వంటి వరల్డ్ వైడ్ చేసే అనేక రకాల సాహస విన్యాసాలు చేసే కళాకారులు అలరిస్తారు. పిల్లలు ఇష్టపడే జోకర్స్ కూడా ఈ షోలో స్పెషల్ గా నిలుస్తారు. దాదాపు 80 మందికి పైగా పలు దేశాల కళాకారులు ఈ షోలో ఉన్నారు. విదేశీ డాగ్స్ తో నెంబర్ కౌంటింగ్ షో, ఫ్యామిలీకి వినోదం పంచే ఎన్నో కార్యక్రమాలు ఈ సర్కస్ లో ఉంటాయి.
Also Read: మేడారం జాతర ఓ మహిళ జీవితాన్ని మార్చింది..! ఏమైంది అంటే..?
End of Article