Home News క్షణాల్లో పెళ్లి.. కానీ వధువుని అలా చూసి వెక్కి వెక్కి ఏడ్చిన వరుడు…!!

క్షణాల్లో పెళ్లి.. కానీ వధువుని అలా చూసి వెక్కి వెక్కి ఏడ్చిన వరుడు…!!

by Megha Varna

Ads

క్షణాల్లో పెళ్లి పెట్టుకుని వధువును చూసి వరుడు ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అంతా కూడా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. అలానే వరుడు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే కొన్ని క్షణాల్లో పెళ్లి పెట్టుకుని వధువుని చూసిన వరుడు ఏడ్చేశాడు.

Video Advertisement

ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. డెమొట్రియస్ క్యాషరీస్, అలెగ్జాండ్రియా కూడా ఒకరికొకరు అంటే చాలా ఇష్టం. దీంతో కుటుంబ సభ్యులు వాళ్ల పెళ్లి జరిపించాలని అనుకున్నారు. పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేశారు. పెళ్లిరోజు రానే వచ్చేసింది. దీంతో పెళ్ళికొడుకు అందంగా తయారై పెళ్లి వేదికకి వచ్చేశాడు.

వధువు తెలుపు రంగు గౌను ధరించి దేవకన్యలా తయారయి అమె తండ్రి చెయ్యి పట్టుకుని అక్కడికి వస్తూ ఉండటంతో అది చూసిన వరుడు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంకేముంది సడన్ గా వెక్కివెక్కి ఏడవడం మొదలు పెట్టాడు. అక్కడున్న వాళ్ళంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఫోటోలని మగ్నోలియా రోడ్ ఫిలిం కంపెనీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వీడియోని ఇప్పటికి 34 వేల మందికి పైగా చూశారు.

 

https://www.instagram.com/reel/COIsYbCBfcf/?utm_source=ig_web_button_share_sheet


End of Article

You may also like